క్రైమ్/లీగల్

నలుగురు అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, అక్టోబర్ 10: గుంటూరు అర్బన్ నార్త్ సబ్ డివిజన్ పరిధిలోని మంగళగిరి , తాడేపల్లి, పెదకాకాని పోలీసుస్టేషన్ల పరిధిలో వివిధ దొంగతనాలు, దారిదోపిడీలకు పాల్పడిన నలుగురు అంతర్‌జిల్లా నేరస్థులను బుధవారం అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ జీ రామకృష్ణ వెల్లడించారు. మంగళగిరి రూరల్ పోలీసుస్టేషనులో సిఐలు శేషగిరిరావు, హరికృష్ణ, ఎస్సై సత్యనారాయణలతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నిందితులను మీడియాకు చూపి కేసుల వివరాలను డిఎస్పీ రామకృష్ణ వివరించారు. విజయవాడకు చెందిన సింగరాతి ఏబేలు, బలగం సంపత్‌కుమార్, పాలపర్తి వంశీకృష్ణ, ఎండీ ఫరూఖ్‌లను అరెస్ట్ చేసి వారినుంచి లక్షా50 వేల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ రామకృష్ణ వెల్లడించారు. పై నలుగురు విజయవాడలో వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్నేహితులు. గత జూలై 6న పెదకాకాని సమీపంలోని మానససరోవరం వద్ద బోలోరో వాహనం ఆపి విశ్రాంతి తీసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను బెదిరించి వారినుంచి 10 వేల నగదు, సెల్‌ఫోను దోచుకున్నారు. అదేరోజు తెల్లవారుఝామున సీతానగరం వద్ద నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిపై దాడిచేసి 7 వేల రూపాయలను దోచుకున్నారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి సాయిబాబా మందిరం వద్ద గత మే 10వ తేదీన నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని బంగారు తాడును, ఆత్మకూరు గ్రామంలో గత ఏప్రిల్ 30న నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని బంగారు నల్లపూసల గొలుసును లాక్కుని పరారయ్యారు. వీరితో పాటు వై హేమంత్, షేక్ అక్బర్ భాషా, అజయ్‌కుమార్ అనే వారు కూడా ఈ కేసుల్లో ముద్దాయిలని, వీరిలో హేమంత్ పరారీలో ఉండగా అక్బర్ భాషా, అజయ్‌కుమార్‌లు వేరే కేసుల్లో అరెస్టు అయి జైల్లో ఉన్నారని డిఎస్పీ రామకృష్ణ వివరించారు. విజయవాడ, సూర్యాపేట, గన్నవరం, ఇబ్రహీంపట్నం, గుంటూరు మొదలైన పోలీసుస్టేషన్ల పరిధిలో ఏబేలు, వంశీకృష్ణలు 20 కేసుల్లో ముద్దాయిలుగా ఉండి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారని డిఎస్పీ వివరించారు. నిందితులను తక్కెళ్లపాడు ఓవర్‌బ్రిడ్జి వద్ద అరెస్ట్ చేశామని, వారినుంచి మోటారు సైకిల్, ఆకురాయి ఆయుధం, రెండు సెల్‌ఫోన్లు, బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నామని, నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందికి రివార్డులకు సిఫార్సు చేస్తామని డిఎస్పీ రామకృష్ణ వివరించారు.