క్రైమ్/లీగల్

అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, అక్టోబర్ 10: భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం, అత్తింటి వారు అదనపు కట్నం కోసం పెట్టే వేధింపులు భరించలేక ఓ వివాహిత బుధవారం ఉదయం తనువు చాలించిన సంఘటన సుల్తానాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన శ్రావణి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సూసైడ్ నోట్, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన దేవరకొండ శ్రావణి (26)కు పాలకుర్తి మండలం ముంజంపల్లికి చెందిన తంగళ్లపల్లి రాజేష్‌తో గత సంవత్సరం నవంబర్ 25న వివాహం జరిగింది. వివాహ సమయంలో ఐదు లక్షల కట్నంతో పాటు ఇతర లాంఛనాలు అందజేశారు. వివాహమైన నెల రోజుల పాటు సక్రమంగా సాగిన వీరి కుటుంబంలో, రాజేష్ అక్రమ సంబంధం, అదనపు కట్నం కోసం అత్తింటివారి వేదింపులతో చిచ్చు చెలరేగింది. రాజేష్ దగ్గరి బంధువు మహిళతో పాటు మరో యువతితో పెళ్లికి ముందు నుంచి అక్రమసంబంధం ఉందని, ఇటీవల అట్టి అక్రమ సంబంధం బయట పడటంతో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య పంచాయతీ జరుగగా తప్పు ఒప్పుకొని మరోసారి తప్పు చేయనని రాజేష్ పత్రం రాసిచ్చాడు. తిరిగి అక్రమ సంబంధం కొనసాగించడంతో ప్రశ్నించిన శ్రావణిని అత్తింటి వారు దూషించడంతో పాటు కొట్టడంతో నాలుగు నెలల క్రితం సుల్తానాబాద్‌లోని పుట్టింటికి వచ్చింది. తన కూతురిని తీసుకపొమ్మని శ్రావణి తల్లి అత్తింటి వారిని వేడుకోగా మరో ఐదు లక్షలు అదనంగా కట్నం ఇవ్వాలని, లేని పక్షంలో అమ్మాయిని మేము తీసుకెళ్లమని తేల్చి చెప్పడంతో మనస్థాపానికి గురైన శ్రావణి బుధవారం తన ఇంటిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని చనిపోయింది. తన చావుకు భర్త రాజేష్, అత్త సరోజన, మామ కాంతయ్య, పెద్ద ఆడబిడ్డ భర్త శంకరయ్య, చిన్న ఆడబిడ్డ సమతతో పాటు అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరు మహిళలు కారణమని, తన తల్లికి, జిల్లా కలెక్టర్‌కు రాసిన ఉత్తరంలో శ్రావణి పేర్కొంది. శ్రావణి మృతితో కుటుంబ సభ్యుల రోధనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మృతురాలి తల్లి హరిప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె.రాజేష్ తెలిపారు.