క్రైమ్/లీగల్

కుమార్ మృతిపై పోలీసుల ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరపట్నం, అక్టోబర్ 10: శంకరపట్నం మండలం తాడికల్‌లో రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన గడ్డి కుమార్ మృతిపై హుజూరాబాద్ రూరల్ సీఐ బుధవారం గ్రామంలో విచారణ చేపట్టారు. అదేవిధంగా కరీంనగర్ స్పెష ల్ బ్రాంచి పోలీసులు వేర్వేరుగా ఇతని మృతిపై వివరాలు సేకరించినట్లు తెలిసింది. కుమార్ మృతి వ్యవహారం పోలీసులకు అంతు చిక్కకుండా పోయింది. గడ్డి కుమార్ (23) అనే యువకుడు ఇదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుందామనే సమయంలోనే అనుమానాస్పదంగా మృతి చెం ది గ్రామ సమీపంలోని పత్తి చేనులో శవమై కనిపించడంపై గ్రామంలో పలు అనుమానాలు రేకెత్తుతున్నా యి. కుమార్ గ్రామానికి చెందిన మై నర్ బాలికతో గత మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నప్పటికినీ మైనర్ బాలిక కుటుంబ సభ్యులు నాడు ఏమీ అనకుండా పెళ్లి చేసుకుందామనే సమయంలో కుమార్‌ను హత్య చేసి ఉంటారా? లేదా? అనే అనుమానాలు గ్రామస్థులు రేకెత్తిస్తున్నారు. కుమార్ గ్రామంలో మిత్రులతో కలివిడిగా ఉంటూ స్నేహభావంతో ఉండేవాడని, అతని మృతి పై గొల్లవాడ ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. ఇతని మృతిపై హుజూరాబాద్ రూరల్ సీఐ రవికుమార్ బుధవారం మృతుని కుటుంబ సభ్యులతో పాటు ప్రత్యక్ష సాక్షితో మాట్లాడి వివరాలు సేకరించేందుకు యత్నించారు. కాగా, తాడికల్ సమీప గ్రామాలైన దుద్దెనపల్లి, చింతగుట్ట, వంకాయగూడెం, కేశవపట్నం, తదితర గ్రామాలలో సీసీ కెమెరాల ఫుటేజీని సేకరిస్తున్నారు. దీని ఆధారంగా నిందితులను గుర్తించే అవకాశాలు ఉండవచ్చునని పలువురు చర్చించుకుంటున్నారు. కుమార్ మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ విషయంపై కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ఏర్పాటు చేసిన విచారణ బృం దం గ్రామంలో వివరాలు గోప్యంగా సేకరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసిం ది. అదేవిధంగా స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణపై దాడి చేసిన వారి వివరాలను వీడియో ద్వారా వివరాలు సేకరించి సంబంధించిన బాధ్యులపై చ ర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయం గా తెలిసింది.
ఏదేమైనప్పటికినీ కుమార్ అనుమానాస్పద మృతి పోలీసులతో పాటు మండల ప్రజలకు అంతుచిక్కకుండా పోయింది.