క్రైమ్/లీగల్

వ్యభిచార ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, అక్టోబర్ 10: వ్యభిచార గృహాన్ని నిర్వహించడానికి కుమారుడిని, మేనల్లుళ్లను రంగంలో దించిన ఓ మహిళ గుట్టును కొత్తపేట పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన పత్తిపాటి శాంతి(45) కొంతకాలంగా తనింట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. బయటి వారైతే డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనో లేక బ్లాక్‌మెయిల్ చేస్తారనో భావించింది. సొంత మేనల్లుళ్లు, తన కుమారుడికి పడుపు వృత్తి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. కుమారుడు హేమంత్(23), మేనల్లుళ్లు దినేష్(20), సురేష్(23) ఆగిరిపల్లికి చెందిన వరుణ్ అలియాస్ చంటి(25), రామకృష్ణ(30) అనే యువకులు బయటి ప్రాంతాల నుండి అమ్మాయిలను, విటులను మాట్లాడి శాంతి ఇంటికి పంపుతున్నారు. బయటి నుండి వచ్చిన అమ్మాయిలను కాంట్రాక్టుకు మాట్లాడుకుంటారు. అమ్మాయి అందచందాలను బట్టి వారానికి సుమారు రూ. 20 నుండి రూ. 30 వేలు ముట్టచెబుతారు. తాము ఎంతమంది విటులను పంపినా ఆమె మారు మాట్లాడకుండా పడుపువృత్తి చేయాల్సిందే. ఎంతోకాలంగా సాగుతున్న ఈ వ్యవహారంపై సీఐ జే మురళీకృష్ణకు సమాచారం అందింది. దాంతో ఆయన మంగళవారం రాత్రి తన సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించారు. శాంతితో పాటు ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేశారు. పోలీసులు దాడి చేసిన సమయంలో హైదరాబాద్‌కి చెందిన ఓ యువతి(22), మరో విటుడు కూడా పట్టుబడ్డారు.