క్రైమ్/లీగల్

ఇద్దరిని మింగేసిన మితిమీరిన వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, అక్టోబర్ 10: ద్విచక్ర వాహనంపై మితి మీరన వేగం ఇద్దరు యువకులను మింగేసింది. మరో ఇద్దరును ఆసుపత్రి పాలు చేసిన సంఘటన దువ్వాడ పోలీస్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులను భీతావహులను చేసిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలావున్నాయి. గాజువాక ప్రాంతానికి చెందిన లెక్కల అఖిల్ (23), వడ్డాది కనకరాజు(24)లు బుధవారం సాయంత్రం అనకాపల్లి వైపు నుండి గాజువాక వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. కూర్మన్నపాలెం స్టీల్ సిటీ ఆర్టీసీ డిపో ఎదురుగా వచ్చేసరికి రోడ్డు దాటుతున్న ఇద్దరు లారీ క్లీనర్స్‌ను ఢీకొట్టారు. దీంతో అధుపు తప్పిన ద్విచక్ర వాహనం జాతీయ రహదారికి అనుకుని ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ను ఢీకొట్టి సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకుని వెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అఖిల, కనకరాజులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రహదారి దాటుతూ ప్రమాదానికి గురై గాయపడిన ఇద్దరు లారీ క్లీనర్స్‌ను వెనువెంటనే స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కెంబూరి సత్యనారాయణ చికిత్స నిమిత్తం ఆసుపత్రి 108 అంబులెన్స్‌లో తరలించారు. లారీ క్లీనర్లు వారి పని చేస్తున్న లారీలను యార్డ్‌లో పార్కింగ్ చేసిన తరువాత సొంత పని బయటకు వస్తుండగా ఈ ప్రమాదంలో చోటుకుంది. ప్రమాదంలో చిత్తూరుకు చెందిన కొర్రా వాసుదేవ(26)కి కుడి కాలు విరిగి పోగా, నాగమళ్ల శివ శంకర్ గౌడ మురళీ జోషి(32)కు ఎడమ తుంటె భాగంలో తీవ్ర గాయాలయ్యాయని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మితి మీరిన వేగమే అఖిల్, కనకరాజులు మృతికి కారణం అని ఇన్‌స్పెక్టర్ కెంబూరి సత్యనారాయణ తెలిపారు. మృతుడు అఖిల్ గాజువాకలోని గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన వాడు కాగా, మరో మృతుడు వడ్డాది కనకరాజు గాజువాక ప్రాంతానికి చెందిన ఇందిరాకాలనీకి చెందినవాడుగా పోలీసులు తెలిపారు. అఖిల్ వెల్డర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మృతదేహాలను రోడ్డు సేప్టీ వాహనంపై పోస్టుమార్టం నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అలాగే సంఘటనా స్థలాన్ని ఎస్సీ ఎస్టీ సెల్ ఎసీపీతో పాటు ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, కిశోర్‌కుమార్‌లు సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం ఆరా తీశారు. అఖిల్, కనకరాజులు మృతి వార్తతో గుడివాడఅప్పన్నకాలనీ, ఇందిరాకాలనీవాసులకు విషాదచాయిలు అలుముకున్నాయి. సంఘటనా స్థలం వద్దకు భారీ బంధువులు, స్నేహితులు చేరుకున్నారు. మృతులు ఇరువురుకు వివాహం కాలేదు. ఈ మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని యాచకుడు మృతి
ఉక్కునగరం, అక్టోబర్ 10: ఉక్కు టౌన్ షిప్‌లో గుర్తు తెలియని వృద్ద యాచకుడు బుధవారం మృతి చెందారు. స్టీల్‌ప్లాంట్ పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. ఉక్కునగరంలోని విశాఖ విమల్ విద్యాలయం సమీపంలో ఉన్న బస్‌షెల్టర్‌లో గత కొంతకాలంగా ఉంటున్న గుర్తు తెలియని యాచకుడు అనారోగ్యంతో మృతి చెందారని పోలీసులు తెలిపారు. 60 ఏళ్ల వయస్సు ఉండే యాచకుడు స్థానికులు పెట్టింది తింటూ బస్‌షెల్టర్ వద్దే కొంతకాలంగా తలదాసుకుంటున్నారు. అటుగా రాకపోకలు సాగించే వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.