క్రైమ్/లీగల్

హత్య కేసులో నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల రూరల్, అక్టోబర్ 11: రౌడీల మధ్య అధిపత్య పోరే శెట్టిపల్లి ప్రేమ్‌కుమార్ (38) హత్యకు దారితీసిందని గురజాల డీఎస్పీ కెవివిఎన్‌వి ప్రసాద్ తెలిపారు. గురువారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ నెల 1న మాచర్లలో హత్యకు గురైన ప్రేమ్‌కుమార్ కేసులో నిందితుల వివరాలు వెల్లడించారు. ప్రేమ్‌కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మోక జగన్ స్నేహితులని తెలిపారు. రేపల్లె ప్రాంతంలో ఇద్దరూ రౌడీయుజం చేస్తూ ఉండేవారని, వారి మధ్య వచ్చిన పొరపొచ్చాల నేపథ్యంలో బద్ధ శత్రువులుగా మారి ఒకరినొకరు చంపుతామని ప్రతిజ్ఞ చేసుకున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఈ నెల 1వ తేదీన పథకం ప్రకారం కాపు కాచి ప్రేమ్‌కుమార్ హతమార్చినట్లు ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే జగన్ అనుచరుడు యరగల్ల వెంకట సుబ్బారావు ప్రేమ్‌కుమార్‌ను రింగ్ రోడ్డులోని అతని నివాసం నుండి మార్కెట్ యార్డు సమీపంలోని ఎస్‌వీఆర్ బార్‌కు తీసుకువచ్చాడన్నారు. బార్ బయట నుండి రాగానే సుబ్బారావు అతనితో మాట్లాడుతున్నట్లుగా ఉండి అప్పటికే కారులో కాపు కాచి ఉన్న నిందితులకు సైగ చేయటంతో వారు ప్రేమ్‌కుమార్‌ను వెంబడించి కత్తులు, గొడ్డళ్ళతో నరికి చంపారు. హత్య అనంతరం నిందితులు ఏపీ 07 టీసీ 1233లో రెంటచింతల మండల పరిధిలోని సత్రశాలకు పారిపోయినట్లు డీఎస్పీ వివరించారు. కేసులో నిందితులైన 11 మంది స్థానిక మార్కెట్ యార్డులో ఉన్నట్లు సమాచారం అదంటంతో నిందితులైన జగన్, సుబ్బారావు, మేకా రాజేష్ ఖన్నా, మైలా శివ రామకృష్ణ, జ్యోతిరాజు, జూలకంటి సుధాకర్, కొక్కిలగడ్డ వెంకటేశ్వర్లు, చదలవాడ రమేష్, తోట ఉదయ్‌కుమార్, బొల్లం అంకమరావు, జూలకంటి సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రేమ్‌కుమార్‌ను హత్య చేసినట్లు వారు అంగీకరించారని తెలిపారు. సత్రశాలలో దాచిన కత్తులతో పాటు సెల్‌ఫోన్లను స్వాధీనపరచుకుని రిమాండ్ నిమిత్తం స్థానిక మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో అర్బన్ సీఐ ఎస్ సాంబశివరావు పాల్గొన్నారు.