క్రైమ్/లీగల్

విద్యార్థిని ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, అక్టోబర్ 11: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జగిత్యాల జిల్లాకు చెందిన భూమారెడ్డి కుమార్తె సంధ్య (19) మైసమ్మగూడలోని ఎంఆర్‌ఈసీఈ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్‌లో ఉంటూ సివిల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతుంది. హాస్టల్‌లో తోటి విద్యార్థుల సామాగ్రి చోరీకి గురికావడం, కొంత సామగ్రి, డబ్బులు.. సంధ్య ర్యాక్‌లో దొరకడంతో తోటి విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అందించారు. దీంతో సంధ్య మనస్థాపంతో హాస్టల్ భవనం నాల్గవ అంతస్థు పైనుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేసింది. తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది గమనించి సంధ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.