క్రైమ్/లీగల్

నల్లా కుంటలో పడి యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, అక్టోబర్ 11: నల్లాకుంటలోపడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన దేవరకద్ర పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలో గల బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా కొండ అశోక్‌రెడ్డి ఇంటి నిర్మాణం చేపడుతుండటంతో అక్కడ సెంట్రింగ్ పని చేసెందుకు జీనుగరాలకు చెందిన ఎరుకలి బాలకిష్టయ్య (20) కూలిపని చేసేందుకు పూనుకున్నాడని గురువారం ఉదయం సెంట్రింగ్ పనికి నీళ్లు పడుతుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందాడని తెలిపారు. మృతుని తండ్రి ఎరుకలి పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.