క్రైమ్/లీగల్

దాబాలో గంజాయి అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, అక్టోబర్ 11: దాబా హోటల్‌లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి 5కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సంగారెడ్డి డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి తెలిపారు. గురువారం సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజాస్థాన్ రాష్ట్రానికి చెందిన అనిల్‌కుమార్, ప్రతాప్‌సింగ్‌లు సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి వద్ద చౌదరి దాబా హోటల్‌ను నిర్వహిస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాంధించాలనుకొని కొంతకాలం వారి హోటల్‌కు వచ్చే లారీ డ్రైవర్లు, విద్యార్థులు, వివిధ వ్యక్తులకు గంజాయిని విక్రయిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు గురువారం దాబా హోటల్‌ను తనిఖీ చేయగా 4కిలోల ఎండు గంజాయితో పాటు కిలో వరకు గంజాయితో నింపిన చిన్న చిన్న ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ గంజాయి విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందన్నారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు.
విలువైన వస్తువులు ఇంట్లో పెట్టొద్దు
దసరా పండగ సందర్భంగా తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి కోరారు. స్వస్థలాలకు వెళ్లేవారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇస్తే తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు.