క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, అక్టోబర్ 11: ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగరాజ్‌పల్లిలో గురువారం నాడు జరిగింది. తొగుట సిఐ నిరంజన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన నవీన్ (16), పాపన్నపేట మండలం బాసారం గ్రామానికి యాదగిరి (16), మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన మనోజ్ (16)లు మహాత్మ జ్యోతిరావుపూలే గురుకులంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించారు. మెమోల కోసం ఒకే ఆటోను తీసుకుని పాఠశాలకు వచ్చారు. టిఫిన్ చేసేందుకు దౌల్తాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన టిఎస్ 36టి 3316 నెంబర్ గల ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులు నవీన్, యాదగిరిలు తీవ్ర గాయాలపాలై మృతిచెందారు. మరో విద్యార్థి మనోజ్‌కు తీవ్రగాయాలైనాయి. మనోజ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సందర్శించి కారణమైన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని విద్యార్థుల మృతదేహాలను పంచనామ చేసి పోస్టుమార్టమ్‌కు తరలించినట్లు సిఐ నిరంజన్ వివరించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామన్నారు. కాగా మృతుల బంధువుల రోధనలు అందరిని కంట తడిపెట్టించాయి. మెమో కోసం వచ్చిన తమ కుమారులు మృత్యువాత పడటంతో జీర్ణించుకోలేని వారి బంధువుల ఆర్థనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. విద్యార్థుల మృతికి కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబీకులు డిమాండ్‌చేశారు.