క్రైమ్/లీగల్

లారీ ఢీకొని భార్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, అక్టోబర్ 11: పెద్దపల్లి నుండి సెంటనరీ కాలనీకి వెళుతున్న దంపతులు పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం ముందు లారీ డీ కొని భార్య రాజేశ్వరీ మృతి చెందిన సంఘటన గురువారం పెద్దపల్లిలో చోటు చేసుకుంది. సెంటనరీ కాలనీకి చెందిన దంపతులు బోయిని రాజయ్య, భార్య బోయిని రాజేశ్వరీ ద్వీచక్ర వాహనంపై పెద్దపల్లికి వచ్చి షాపింగ్ చేసుకోని తిరుగు ప్రయాణంలో బస్టాండ్ వద్దకు రాగానే లారీ డీ కొనడంతో హెల్‌మెట్ ధరించిన రాజయ్య గాయాలతో బయటపడ్డాడు. రాజేశ్వరీ లారీ వెనుకటైర్ క్రింద పడడంతో తల పగిలి అక్కడి కక్కడే మృతి చెందింది. గాయాలపాలైన రాజయ్యను ట్రాఫిక్ ఎస్సై ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.