క్రైమ్/లీగల్

గుండెపోటుతో కంప్యూటర్ ఆపరేటర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, అక్టోబర్ 12: నందిపేట మండల విద్యా వనరుల కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న బొడ్డు ఈశ్వర్(32)అనే వ్యక్తి రాత్రి విధులు నిర్వర్తిస్తూ కార్యాలయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. కాగా, వేళాపాళా లేకుండా ఎంఇఓ శ్రీనివాస్‌రెడ్డి పని ఒత్తిడి పెంచడం వల్లే ఈశ్వర్ గుండెపోటుతో మృతి చెందాడని ఆరోపిస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఈశ్వర్ మృతదేహంతో ఎంఇఓ కార్యాలయం ఎదుట కుటుంబీకులు, బంధువులు ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు. ఈశ్వర్ గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా ఎమ్మార్సీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఆపరేటర్ ఈశ్వర్ భార్యపిల్లలతో కలిసి 8.30గంటల ప్రాంతంలో నందిపేటలోని దుర్గాదేవి వద్దకు పూజలు చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఎంఇఓ శ్రీనివాస్‌రెడ్డి, ఈశ్వర్‌కు ఫోన్ చేసి టీచర్స్ మిడ్‌డే మిల్స్‌కు సంబంధించిన బిల్లులను కంప్యూటర్ నుండి పంపించాలని ఆదేశించారు. దీంతో ఈశ్వర్ వెంటనే ఎమ్మార్సీ భవనం వద్దకు వెళ్లి కంప్యూటర్ ఆన్ చేసి బిల్లులకు సంబంధించి పని చేస్తుండగా, ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కార్యాలయం వరండాలోనే పడిపోయాడు. అదే బాధతో ఈశ్వర్ తోటి ఉద్యోగి అయిన ఎంఎస్ కోఆర్డినేటర్‌గా పని చేసే సాగర్‌కు ఫోన్‌లో తన పరిస్థితిని తెలుపడంతో వెంటనే సాగర్ కార్యాలయానికి చేరుకుని ఈశ్వర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కారు కోసం వెళ్లాడు. మళ్లీ వచ్చే సరికి ఈశ్వర్ ప్రాణాలు వదిలాడని సాగర్ తెలిపారు. వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు శవాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అధికారులు పని ఒత్తిడి చేయడం వల్లే ఈశ్వర్ మృతి చెందాడని ఆగ్రహంతో శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తూ ఎమ్మార్సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయన భార్యకు కార్యాలయంలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు మండల కాంప్లెక్స్ అధికారులు, పీఆర్‌టీయు నాయకులు అక్కడకు చేరుకుని బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని, భార్యకు ఏదైనా పని కల్పించాలని పై అధికారులకు రాసి పంపుతామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అంత్యక్రియల నిమిత్తం 20వేల నగదు అందించారు.