క్రైమ్/లీగల్

ప్రిన్సిపాల్ తిట్టాడని ఇళ్లు వదలి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 12: స్థానిక రైల్వే కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆరు మంది విద్యార్థులు గురువారం నుంచి కనిపించకపోవడం తిరుపతిలో సంచలనంగా మారింది. వారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా శనివారం రాత్రి వరకు వారి ఆచూకీ తెలియలేదు. విద్యార్థుల కోసం తిరుపతి ఈస్ట్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసుల కథనం మేరకు స్థానిక రైల్వేకాలనీ, రేణిగుంట మండలం కరకంబాడికి చెందిన వినయ్‌కుమార్, పూజిత్ నాయక్, వంశీ, వినయ్, బాలాజీ, ప్రశాంత్‌లు రైల్వేకాలనీలోని ఓప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. వీరంతా గురువారం ఉదయం ట్యూషన్‌కు వచ్చి ఆ తరువాత స్కూల్‌కు వెళ్లకుండా కొత్తగా విడుదలైన ఓ సినిమాకు వెళ్లారు. ఆ తరువాత స్కూల్‌కు వచ్చారు. ఆలస్యంగా వచ్చిన వీరిని స్కూల్ ప్రిన్సిపాల్ పిలిపించి మందలించాడు. ఈవిషయమై వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటికి వెడితే తమను కుటుంబ సభ్యులు ఎక్కడ తిడతారోనన్న భయంతో ఆరు మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తమ పిల్లల కోసం గాలించడం మొదలు పెట్టారు. శుక్రవారం ఉదయం వరకు వారి ఆచూకీ తెలియకపోవడంతో ఈస్ట్‌పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ తిట్టడంతో తమ పిల్లలు ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్లారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా విద్యార్థుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. వారి కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. కాని రెండు రోజులుగా తమ పిల్లలు ఎక్కడున్నారో, ఏమయ్యారో అంటూ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరుమున్నీరవుతున్నారు.

అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్
* 8 దుంగలు స్వాధీనం
తిరుపతి, అక్టోబర్ 12: వివిధ మార్గాల్లో ఎర్రచందనాన్ని తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకోవడంలో ప్రతిభ చూపిస్తున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది శుక్రవారం కూడా అదే తరహాలో ఓ వాహనంలో తరలిస్తున్న ఎర్రచందం దుంగలను స్వాధీనం చేసుకుని, అందులోని ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా స్థానిక టాస్క్ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంల ఐజీ కాంతారావు మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది రేణిగుంట-కడప మార్గంలోని కుక్కల దొడ్డి వద్ద కాపు కాశారన్నారు. అయితే అప్పటికే స్మగ్లింగ్ వాహనం వెళ్లిపోయినట్లు తెలియడంతో మరో బృందానికి సమాచారం అందించారన్నారు. సమాచారం అందుకున్న ఆర్‌ఐ సత్యనారాయణ బృందం కడప మార్గంలోని బాలేపల్లి వద్ద ప్రకృతి వనం సమీపంలో టాటా ఏస్ వాహనాన్ని గుర్తించి తనిఖీ చేశారని తెలిపారు. అందులో ఖాళీ ట్రేలు మాత్రమే కనిపించాయి. అయితే వాహనం పైభాగాన్ని వెల్డింగ్ చేసినట్లు గుర్తించి వాహనంలోని వారిని ప్రశ్నించడంతో వారు భయపడటం గుర్తించారన్నారు. వాహనంలో వెల్డింగ్ చేసిన భాగాన్ని తొలగించి చూడగా అందులో 8 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయని చెప్పారు. వీటిని కర్ణాటక రాష్ట్రం హోస్పేట్‌కు తరలిస్తున్నట్లు గుర్తించామని ఐజీ కాంతారావు తెలిపారు. ఇందులో రైల్వేకోడూరుకు చెందిన హరినాథ్, సంతనగర్‌కు చెందిన ఈశ్వర్, రంగనాథ్‌లను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ వాహనం రైల్వే కోడూరుకి చెందిన షఫీ అనే వ్యక్తికి సంబంధించింగా గుర్తించామన్నారు. గతంలోను స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా తాము స్మగ్లింగ్ చేస్తున్న వాహనాలపై పోలీస్, ప్రెస్, అంబులెన్స్, ఆర్మీ, హెరిటేజ్ పేర్లు పెట్టుకుని వాహనాల్లో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో టాస్క్ఫోర్స్ ఏఎస్పీ లక్ష్మీనారాయణ, ఏసీఎఫ్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఆపరేషన్ టీంలో ఆర్‌ఐ సత్యనారాయణ, ఆర్‌ఎస్‌ఐ రవికుమార్, సిబ్బంది రామ్‌భూపాల్, శ్రీనివాసులు, రాము, హరిప్రసాద్, గోకూరి, కాశయ్య, సుజైకుమార్, రెహమాన్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.