క్రైమ్/లీగల్

విస్తృతంగా పోలీసు తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వై రామవరం, అక్టోబర్ 12: వై రామవరం మండల సరిహద్దు ప్రాంత లోతట్టు గ్రామాల్లో శుక్రవారం అడ్డతీగల సీఐ ఎ మరళీకృష్ణ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు మండలంలోని చింతకర్రపాలెం, జాజిగడ్డ, శింగవరం, జంగాలతోట గ్రామాల ప్రధాన రహదారిలో సిఆర్పీఎఫ్ ఎఫ్42 బెటాలియన్ పోలీసు బలగాల సహాయంతో అనుమాస్పద ప్రదేశాల్లో తనికీలు నిర్వహించారు. అయా గ్రామాల ప్రజలను అక్కడ తిష్ఠవేసిన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఇంటింటా తిరిగి పరిశీలించారు. అపరిచితులు, అనుమాస్పద వ్యక్తులపై నిఘా విధించారు. కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ ఎఫ్42 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ క్లారెన్స్, సిబ్బంది, స్థానిక ఎస్సై ఎన్ సతీష్‌బాబు పాల్గొన్నారు.