క్రైమ్/లీగల్

అసూయతోనే హత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వ్యాపార లావాదేవీల్లో విబేధాలే కారణం
* రూ.8లక్షల సుపారీ ఇచ్చిన ప్రధాన నిందితుడు శోభన్‌కుమార్
* కథ నడిపించిన బేల్దారి మేస్ర్తి భూపతి
* నగరంలో సంచలనం రేపిన హత్య కేసును చేధించిన పోలీసులు
==============================================
నెల్లూరు, అక్టోబర్ 12: నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఈనెల 5వ తేదీ సాయంత్రం ఏడుగంటల సమయంలో నెల్లూరు శిరీష్‌కుమార్ (37) అనే బిల్డర్‌ను హత్యచేసిన కేసులో నిందితులైన సాదేపల్లి శోభన్‌కుమార్, చింతాల భూపతితోపాటు మరో ఆరుగురిని నవాబుపేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వ్యాపారంలో తమను ఎదిరించి సొంతంగా ఎదుగుతున్నాడని, తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని అసూయ పెంచుకున్న శోభన్‌కుమార్, తన వద్ద పనిచేస్తున్న భూపతితో కలిసి శిరీష్ హత్యకు పథకం పన్ని హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. శుక్రవారం నగర డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో హత్య ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ఎన్.బీ.ఎం.మురళీకృష్ణ వెల్లడించారు. కోవూరు గ్రామ శివారులోని ఇంద్రలోక్ అవెన్యూలో నివసించే శోభన్‌కుమార్ వృత్తిరీత్యా అధ్యాపకుడు. అతను అక్కడే సొంతంగా అపార్ట్‌మెంట్లు నిర్మిస్తూ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో తనకు సన్నిహితంగా ఉంటున్న నెల్లూరు శిరీష్‌కుమార్‌ను వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్నాడు. శిరీష్‌కు అంతకుముందే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన అనుభవం ఉంది. ఏడాదిపాటు ఇద్దరూ కలిసి చేసిన వ్యాపారంలో సుమారు రూ.30లక్షల ఆదాయం రాగా ఇద్దరూ పంచుకున్నారు. వ్యాపార మెళకువలు తెలుసుకున్న శోభన్‌కుమార్ తనను మోసం చేస్తున్నాడని భావించి శిరీష్ తన దారి తాను చూసుకుని సొంతగా వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య విబేధాలు పెరిగాయి. తనవద్ద పెరిగి తనకే ఎదురు తిరిగిన శిరీష్‌పై కక్ష పెంచుకున్న శోభన్ అతడ్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తాను నిర్మించే భవనాలకు మేస్ర్తిగా పనిచేస్తున్న సుందరయ్య కాలనీకి చెందిన చింతాల భూపతి సహాయం కోరాడు. అప్పటికే పలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న భూపతి అందుకు అంగీకరించాడు. తన వద్ద ఉన్న యువకులతో శిరీష్‌ను హత్య చేయిస్తానని మాట ఇచ్చి అందుకు రూ.8లక్షల సుపారీ మాట్లాడుకున్నారు. తనవద్ద పనిచేసే రాజేష్, ఇల్లపు వంశీకృష్ణ, తిరుపతి సాయి, నాగరాజా విక్రమ్ అలియాస్ విక్కీ, పిట్టు రాకేష్, వేణుగోపాల్, తుపాకుల సురేంద్ర, డోకు, సాయిమనోజ్‌లను ఈ పనికి భూపతి పురమాయించారు.
హత్య జరిగిన తీరు:
శిరీష్ హత్యకు ఒప్పందం కుదరడంతో తన అనుచరులకు హత్య చేయమని పురమాయించిన భూపతి తగిన సమయం కోసం ఎదురుచూడసాగాడు. గతనెల 29న అందరూ కలిసి చర్చించుకున్నారు. శిరీష్ కదలికల గురించి శోభన్‌కుమార్, భూపతి తమ వారికి సమాచారం ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈనెల 4న శిరీష్‌ను చంపాలని భావించినప్పటకి వీలుపడలేదు. దాంతో ఐదవ తేదీ సాయంత్రం రాత్రి ఏడుగంటల సమయంలో శిరీష్ ఇంటి నుంచి బయలుదేరిన విషయాన్ని సురేంద్ర, శోభన్‌కుమార్ అప్పటికే ఇనమడుగు సెంటర్‌లో ఉన్న ఆరుగురు ముఠా సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారికి తోడుగా మరో ముగ్గురు నిందితులు నాలుగవ మైలు వద్ద మద్యంతో సిద్ధంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. శిరీష్ తన బైకుపై ఆత్మకూరు బస్టాండ్ సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి అనుసరిస్తూ వచ్చిన నిందితులు శిరీష్‌పై ఇనుపరాడ్లు, బీరు బాటిళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన శిరీష్ అక్కడికక్కడే మృతిచెందడంతో నిర్ధారించుకున్న నిందితులు నాలుగవ మైలు వద్ద ఉన్న తమ స్నేహితుల వద్దకు వెళ్లి మద్యం తాగి రాజీవ్ గృహకల్పలోని ఒక ఇంట్లో తలదాచుకున్నారు. వారి వెనుకనే హెల్మెట్లు ధరించి బైకుల్లో వస్తున్న శోభన్, భూపతి శిరీష్ చనిపోయిన విషయాన్ని నిర్ధారించుకుని, ముందుగా మాట్లాడుకున్న ప్రకారం హత్యచేసిన వ్యక్తులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారిని అక్కడ ఉంచి లాయర్‌తో మాట్లాడేందుకు వస్తున్న శోభన్‌కుమార్, భూపతిలను గురువారం రాత్రి 10.30గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో గృహకల్పలో దాక్కుని ఉన్న మిగతా నిందితుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.20లక్షల నగదు, నాలుగు మోటార్ బైక్‌లు, ఆరు సెల్‌ఫోన్లు, మూడు ఇనుపరాడ్లు, బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య సంఘటనలో మిగతా నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నిందితులందరిపై రౌడీషీట్లు తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో నవాబుపేట సీఐ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.