క్రైమ్/లీగల్

చెడ్డీ గ్యాంగ్.. చైన్ స్నాచింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వరుస హత్యలు..దోపిడీలు
* అంతర్రాష్ట్ర ముఠాల స్వైర విహారం
* పోలీసుల నిఘా లోపం
* తప్పించుకుంటున్న అసలు దొంగలు
============================
విశాఖపట్నం, అక్టోబర్ 12: ప్రశాంత విశాఖ నగరంలో భయంతో వణికిపోతున్నారు. రాత్రి లేదు పగలు లేదు ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన జనాల్లో అలముకుంది. గత కొద్ది రోజులుగా చెడ్డీ గ్యాంగ్ నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోపక్క చైన్ స్నాచింగ్ ముఠా నగరంలో స్వైర విహారం చేస్తోంది. గత వారం, పది రోజులుగా ఈ ముఠాలు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాయి. వీటికితోడు హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మొత్తంమీద విశాఖ నగరం క్రైం సిటీగా మారిపోయింది.
గత కొంత కాలంగా నగరంలో విభిన్న నేరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హత్యల విషయానికి వస్తే, అవి జరుగుతున్న తీరు ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. హతమార్చి, సాక్ష్యాలు దొరకకుండా, మృతదేహాలను దహనం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కుమార్తె కాకర పద్మలతను అతి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి గేదెల రాజును గాజువాకలోనే హత్య చేసి, సబ్బవరం దగ్గర ఆ మృతదేహాన్ని తగులబెట్టారు. ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేసినా, కేసు మాత్రం పూర్తిగా కొలిక్కి రాలేదు. ఆ తరువాత ఈ తరహా హత్యలు అనేకం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనేకం జరిగాయి. కొద్ది రోజుల కిందట దువ్వాడ దగ్గర మూడేళ్ల పాపను హతమార్చి తుప్పల్లో పడేసిన ఘటన విశాఖ వాసులను భయకంపితులను చేసింది. ఈ కేసులో కూడ పోలీసులకు క్లూ దొరకలేదని తెలిసింది. మంత్రిపాలెంకు చెందిన షేక్ మదీనాను హత్య చేసి పడేశారు. హత్యల పరంపర ఓపక్క కొనసాగుతుంటే, మరోపక్క లాకప్ డెత్ నగర పోలీసులకు మచ్చ తెచ్చింది. ఈ లాకప్ డెత్ కేసును నీరు కార్చారు.
పాత నేరస్తులపై నిఘా లోపం?
ఇదిలా ఉండగా, విశాఖలో పాత నేరుస్తులు మళ్లీ జూలు విదుల్చుతున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రౌడీ షీటర్ల సైలెంట్ సెటిల్‌మెంట్లు పెరిగిపోతున్నాయి. పాత నేరస్తులపై పోలీసుల నిఘా లేదని అర్థమవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి నగరంలోకి ప్రవేశించే ముఠాలకు స్థానిక నేరస్తులు సహకరిస్తున్నట్టు సమాచారం. గతంలో పాత నేరస్తులు, రౌడీ షీటర్లు పోలీసుల కనుసన్నలలోనే ఉండేవారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ నేరగాళ్లలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. రాజకీయ నాయకుల అండతో మళ్లీ రెచ్చిపోతున్నారు.
వరుస దోపిడీలు
నగంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న దొంగతనాలు జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. గాజువాక విశే్వశ్వరయ్య కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో దొంగలు స్వైర విహారం చేశారు. కాకానినగర్‌లో 12 తులాల బంగారం, లక్ష రూపాయల నగదును అపహరించుకుపోయారు. ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో బంగారం, వెండి దోపిడీ చేశారు. అల్లిపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 60 తులాల బంగారాన్ని దోచుకున్నారు. డీఆర్‌ఎం కార్యాలయం వద్ద కంట్లో కారం జల్లి 42 లక్షల రూపాయలు, 1200 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారు. నగర శివారు ప్రాంతాలలోని తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చెడ్డీ గ్యాంగ్ గత వారం, పది రోజులుగా దోపిడీలకు పాల్పడుతున్నా, పోలీసులకు చిక్కకపోవడం గమనార్హం. సీసీ కెమేరా ఫుట్‌లో చెడ్డీగ్యాంగ్ కదలికలు కనిపిస్తున్నా పోలీసులు వీరిని పట్టుకోలేకపోతున్నారు. రాత్రిపూట గస్తీ తిరిగే పోలీసుల కంటికి కూడా వీరు చిక్కడం లేదంటే, వీరు పోలీసుల కళ్లుకప్పి ఏవిధంగా తిరుగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో నగరంలో ఒకటి, రెండుసార్లు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దోపిడికి గురైన వస్తువులను రికవరీ చేసుకోవడంలో కార్డన్ సెర్చ్ కొంత వరకూ ఉపకరించింది.
తప్పించుకుంటున్న అసలు నేరస్తులు
విశాఖ నగరంపై అంతర్రాష్ట్ర ముఠా కనే్నసింది. నగరాకి వచ్చి చేతికందింది దోచుకుని తిరిగి వెళ్లిపోతున్న ముఠాలు అనేకం ఉన్నాయి. గుజరాత్, బీహార్, ఖరగ్‌పూర్ వంటి అనేక ప్రాంతాల నుంచి దోపిడీ దొంగలు నగరంలో ప్రవేశిస్తున్నారు. ఇటువంటి వారిపై పోలీసుల నిఘా ఎందుకు లేదు? వీరికి నగరంలో సహకరిస్తున్న వారు ఎవరన్న విషయాన్ని కూడా ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ కనిపెట్టలేకపోతోంది. పాత నేరస్తులు, రౌడీ షీటర్లను అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లకు పిలిచి, కౌన్సిలింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు అటువంటి ప్రక్రియ ఎక్కడా కనిపించడం లేదు. దీనివలనే నగరంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయనడంలో సందేహం లేదు. నగరంలో పోలీసులు పూర్తిగా వాహనాల తనిఖీల్లోను, ఇతర పనుల్లోను నిమగ్నమై ఉన్నారు. దీనివలనే నగరంలో క్రైం రేట్ పెరిగిపోయిందని చెప్పక తప్పదు. ఎంతో కొంత దోపిడీ సొత్తును స్వాధీనం చేసుకుని, స్థానికంగా ఉన్న ఎవరినో అరెస్ట్ చూపించి, పోలీసులు చేతులు దులుపుకొంటున్నారు. దీంతో అసలు నేరస్తులు తప్పించుకు తిరుగుతున్నారు. మళ్లీ సమయం దొరికినప్పుడు నగరంలో చెలరేగిపోతున్నారు.

స్నేహితుని చేతిలో దారుణ హత్య
విశాఖపట్నం(క్రైం), అక్టోబర్ 12: నగరం నడిబొడ్డున దారుణ హత్య జరిగింది. పూల కొట్టులో పని చేస్తున్న ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను బలిగొంది. నిందితుడు పూల కత్తెరతో మెడపై దాడి చేయడంతో తీవ్రగాయాలపాలైన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రెల్లివీధికి చెందిన ముద్దాడ శ్రీను అలియాస్ సైకో శ్రీను(35), కల్లుపాకలకు చెందిన చుక్కా నూకరాజు(45) కలిసి జగదాంబ జంక్షన్ సమీపంలో గల కో-అప్టెక్స్ బట్టల దుకాణం వద్ద గల పూల దుకాణంలో కొంతకాలంగా పని చేస్తున్నారు. వీరు ఇద్దరూ మంచి స్నేహితులు కూడ. పూల దుకాణంలోనికి పనికి శ్రీను రెగ్యులర్‌గా వస్తుండగా, పని ఎక్కువగా ఉన్నప్పుడు నూకరాజు అప్పుడప్పుడు వచ్చి పని చేస్తూ వెళ్లిపోతుంటాడు. ఈ తరుణంలో శుక్రవారం మద్యాహ్నం సమయంలో నూకరాజు పూల దుకాణం వద్దకు వచ్చి పని ఏమైనా ఉందా అని యజమానిని అడగడానికి వచ్చాడు. కొంతసేపు అక్కడ పూలు కుట్టేవాళ్ళతో ఆ మాట ఈ మాట మాట్లాడుతుండగా అక్కడే ఉన్న స్నేహితుడు శ్రీనుని, నూకరాజు పలకరించాడు. ఇంతలో శ్రీనుపై నూకరాజు కొన్ని సెటైర్లు వేయడంతో వీరి మధ్య గొడవ జరిగింది. అయినా సరే నూకరాజు, శ్రీనుపై సెటైర్లు వేయడం ఆపకపోవడంతో కోపంతో ఊగిపోతూ పూల దుకాణం వద్ద ఉన్న కత్తెరతో నూకరాజు మెడపై శ్రీను పొడిచి అక్కడ నుండి పారిపోయాడు. హఠాత్తు పరిణామానికి విస్తుపోయిన అక్కడి వారు మెడ నుండి రక్తం కారుతున్న నూకరాజును వెంటనే కెజిహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కెజిహెచ్‌లో సుమారు రాత్రి ఏనిమిది గంటల సమయంలో అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని హత్య ఏ విధంగా జరిగిందో అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. సంఘటనకు సంబంధించిన సీసీ పుటేజీలను పోలీసులు తీసుకున్నట్టు తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అప్పటి వరకు తమతో పాటు ఉన్న నూకరాజు స్నేహితుని చేతిలో హత్యకు గురికావడం స్థానికులను విస్మయం పరిచింది. సిఐ వెంకటనారాయణ నేతృత్వంలో మహారాణిపేట పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.