క్రైమ్/లీగల్

ఆర్టీసి బస్సు ఢీ కొని వృద్ధుడికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొలుగొండ, అక్టోబర్ 12: ఆర్టీసి బస్సు ఢీ కొని వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. మండంలోని చీడిగుమ్మల గ్రామంలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న వ్యక్తిని ఏలేశ్వరం నుంచి నర్సీపట్నం వెళ్తున్న బస్సు ఢీ కొన్న సంఘటనలో కిల్లాడ ముసిలి(70)కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిని ముసిలిని 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుండి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈమేరకు కుటుంబ సభ్యులకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.

* ప్రమాదాలకు కారణమవుతున్న ఏలేశ్వరం డిపో బస్సులు
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం డిపోకు చెందిన బస్సులు నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఏలేశ్వరం నుంచి వచ్చే బస్సులు ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదానికి కారణమవుతున్నాయి. గత ఆరు నెలల క్రితం విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను, హోంగార్డులు బైక్‌పై వెళ్తుండగా ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఢీ కొనడంతో వారు ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇలా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏలేశ్వరం డిపోకు చెందిన బస్ డ్రైవర్లు ద్విచక్ర వాహనదారులు, పాదచారులను ఢీ కొడుతున్నాయి. ఇప్పటికే ఈప్రాంతానికి చెందిన వారు ఏలేశ్వరం డిపో బస్సు నిర్వహణ పై నర్సీపట్నం డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేసారు. దీనిపై ఉన్నతాధికారులు ఏలేశ్వరం డిపోకు చెందిన బస్సుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.