క్రైమ్/లీగల్

పేకాట శిబిరంపై పోలీసుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 12: పట్టణంలోని ప్రదీప్‌నగర్‌లో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు జరిపారు. శుక్రవారం ఎస్పీ పాలరాజు ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచి పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కలసి పట్టణంలోని ప్రదీప్‌నగర్‌లో ఒక ఇంటిలో పేకాట ఆడుతున్న 12 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.52,130 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

బీజేపీ నేతలపై కేసులు పెడతా!

విజయనగరం, అక్టోబర్ 12: తనపైన, తన భార్యపైన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా బీజేపీ నాయకులు విమర్శిస్తే వారిపై కేసులు పెడతామని వైసీపీ నేత ముద్దాడ మధు స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మెల్సీ కోలగట్ల నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లుగా బీజేపీలో పనిచేసిన కేవలం పత్రికా సమావేశాలకే పరిమితమయ్యారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ వస్తుందని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కాగా, ఏ ఒక్కరోజు రాష్ట్ర సమావేశంలోగాని, కేంద్ర నాయకులతోగాని ప్రత్యేక హోదా గురించి చర్చించిన దాఖలాలు లేవన్నారు. ప్రత్యేక హోదాకు వైసీపీ కట్టుబడి ఉందని, జగన్ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో బీజేపీ అధ్యక్షునిగా శివప్రసాద్‌రెడ్డి ఉన్నప్పుడు పార్టీ కార్యాలయ నిర్మాణానికి రూ.1.25 లక్షలు మంజూరు చేస్తే రూ.70 లక్షలతో కార్యాలయం కొనుగోలు చేశారని, మిగిలిన రూ.50 లక్షలు అవినీతి చోటు చేసుకుందని విమర్శించారు. తాను కోర్ కమిటీకి ఈ విషయాన్ని తెలియజేశానన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తనపై వ్యక్తిగత కక్షలు పెట్టుకొని విమర్శించడం సరికాదన్నారు. అన్ని అర్హతలు ఉన్నా తన సతీమణి ముద్దాడ రమణికి స్టాండింగ్ కౌన్సిల్ పదవినిస్తే తమ పదవిని దిగజార్చేవిధంగా మాట్లాడటం సరికాదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి బొద్దాన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.