క్రైమ్/లీగల్

గంధపు ముక్కలు అక్రమ రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 12: గంధపు ముక్కలను జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా స్థానిక అటవీ రేంజ్ అధికారిణి కె శ్రీవాణి ఆధ్వర్యంలో అటవీ అధికారులు నిఘావేసి పట్టుకున్నారు. ఆటోలో 27 గంధపు ముక్కలు(చిన్నసైజు దుంగలు) స్వాధీనం చేసుకున్నారు. ఆటోతోపాటు ఆటో వెంట ఉన్న ఆటోడ్రైవర్‌తో కలిపి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఏలూరు రోడ్డులో అటవీ అధికారులు దారికాచి అటోను అదుపులోకి తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం, చుట్టుపక్కల ఒక నివాసంలో పెరిగిన గంధపు చెట్టును అటవీ శాఖ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నరికి, ముక్కలుగా కోసి, ఆరబెట్టి ఏలూరు అక్రమ రవాణా చేస్తున్నారని రేంజ్ ఆఫీసర్ తెలిపారు. గంధపు ముక్కలు ఈ ప్రాంతంలో అరుదుగా లభిస్తాయని, వీటి విలువను అంచనా వేస్తున్నామని చెప్పారు. ఆటో డ్రైవర్ శంఖాబత్తుల శ్రీనివాసరావు, డీలర్ గద్దే కిషోర్‌బాబు, కార్పెంటర్లు దవులూరి సోమరాజు, జర్ని లక్ష్మణరావులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యుటి రేంజ్ ఆఫీసర్ కె దుర్గారాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.