క్రైమ్/లీగల్

కారు ఢీకొని ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, అక్టోబర్ 12: అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మొయినాబాద్ హిమాయత్‌సాగర్‌కు చెందిన నవీన్ గౌడ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్టు ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. కాగా గురువారం అర్ధరాత్రి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ఐదు మంది కూలీలతో పీవీఎన్‌ఆర్ ఎక్స్‌వేపై పనులు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా వెల్దుర్తికి చెందిన జులకంటి వెంకట్ రెడ్డి(43), కటయ్య, సుధాకర్, సురేష్, అలీ ముత్తయ్య పనులు నిర్వహిస్తున్నారు. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై మల్లికార్జున్ గౌడ్ అనే వ్యక్తి కారులో అతి వేగంగా వెళ్తున్నాడు. కారు అదుపుతప్పి పని చేస్తున్న కూలీలు కటయ్య, సుధాకర్, సురేష్‌ను ఢీకొట్టింది. కటయ్య(40)కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందగా సుధాకర్, సురేష్ గాయాలపాలయ్యారు. మల్లికార్జున్ గౌడ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.