క్రైమ్/లీగల్

కుప్పంలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, అక్టోబర్ 12: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని దేవరాజపురంలో శుక్రవారం వైసీపీ జెండా ఆవిష్కరణను ఆ గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. తమ గ్రామంలో పార్టీ జెండాను ఎలా ఆవిష్కరిస్తారంటూ టీడీపీ, వైసీపీ కార్యకర్తల నడుమ తోపులాటలు జరిగింది. చివరకు ఎలాగోలా పార్టీ జెండాను గ్రామంలో ఆవిష్కరించారు. తోపులాటలో గ్రామానికి చెందిన నలుగురు మహిళలు రమిల(60), మల్లమ్మ(50), సెల్వి(50), గాంధీయా(30)లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే రెస్కో చైర్మన్ మునిరత్నం హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. ఇదిలా ఉండగా తమకు న్యాయం చేయాలంటూ దేవరాజపురం గ్రామస్తులు కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. మొత్తం మీద ఇరుపక్షాల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా తమ నిరసనలు తెలిపారు.