క్రైమ్/లీగల్

పాన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, అక్టోబర్ 13: నిషేధిత గుట్కా ప్యాకెట్ల విక్రయాలు జరుపుతున్న పాన్ షాపులపై అమలాపురం పట్టణ పోటీసులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడు పాన్ షాపుల్లో గుట్కా విక్రయాలు సాగిస్తున్నట్టు గుర్తించి ఏడుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ షాపుల్లో నిల్వ ఉంచిన పదివేల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామకోటేశ్వరరావు తెలిపారు. గుట్కా విక్రయాలు నిర్వహిస్తున్న పాన్ షాపు నిర్వాహకులు అడబాల శ్రీరామ నారాయణ, అడపా వీరవెంకట సత్యనారాయణ, బసవా శివశంకరం, కే జయప్రసాద్, అక్షింతల సూర్యతేజ, మట్టా వెంకటేశ్వరరావు, శిరంగుల రాజారావులను అరెస్టుచేసి కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిషేధిత గుట్కా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. అమలాపురాన్ని గుట్కా రహిత పట్టణంగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనకు పుర ప్రజలు సహకరించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు.