క్రైమ్/లీగల్

వాగులో ఈతకెళ్లి బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, అక్టోబర్ 13: చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తపట్నం వాగులో ఈతకు వెళ్లిన ముగ్గురిలో ఒక విద్యార్థి మృతిచెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. చిలకలూరిపేట పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన రమావత్ బాలు నాయక్ (15), తిరుపాల్, ఖాశిం మిత్రులు. వీరు పురుషోత్తపట్నం సాయిబాబా గుడి దగ్గరలో ఉన్న ఓగేరు వాగులోకి ఈతకు వెళ్లారు. వాగులోతులోకి వెళ్లిన బాలునాయక్ నీటమునిగి మృతిచెందాడు. మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్న తిరుపాల్, ఖాశింలను అక్కడే పశువుల కాపరి రక్షించి ఒడ్డుకు చేర్చాడు. బాలునాయక్ తండ్రి శ్రీనునాయక్, తల్లి వాగిబాయి తమ కుమారుడి మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు పలువురిచే కంటతడి పెట్టించింది. చిలకలూరిపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.