క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, అక్టోబర్ 13: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మండలంలోని యరకన్నపాలెం గ్రామంలో ఈసంఘటన చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై శ్రీను అందించిన వివరాల ప్రకారం యరకన్నపాలెం గ్రామానికి చెందిన చిటికెల కోటయ్యనాయుడుకు కోటవురట్ల మండలం సుర్లవానిపాలెంకు చెందిన హేమలత(24)తో 2013 మార్చిలో వివాహం జరిగింది. వృత్తిరీత్యా కోటయ్యనాయుడు డ్రైవర్ కావడంతో తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉండేవాడు. భార్యపై అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈనేపధ్యంలో శనివారం ఇంటి వద్ద ఉరివేసుకుని హేమలత ఆత్మహత్య చేసుకుంది. అయితే కడుపునొప్పికి మాత్రలు వేసుకోవడంతో అపస్మారక స్థితికి చేరుకుందని దీంతో ఆసుపత్రికి తీసుకువచ్చామని భర్త బంధువులు చెబుతున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మాత్రం హేమలత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కోటంనాయుడు, హేమలతలకు ఇద్దరు పిల్లలున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీను కేసు విచారణ చేస్తున్నారు.