క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జఫర్‌గడ్, అక్టోబర్ 13: రోజు రోజుకూ స్ర్తిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయ. నగరంలో చదువుకుంటున్న ఓ బాలిక దసర సెలవు రావ డంలో ఇంటి వచ్చింది. కామంలో కళ్లు మూసు కుపోయన ఓ యువకుడు తన ఇంటి సమీపం లోని ఓ బాలికపై పశువుగా ప్రవర్తించాడు. తన ఇంటి ముందు నిల్చున్న పదిహేడు సంవత్సరాల వయస్సుగల బాలికను పక్కింటి యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన శనివారం మండలంలోని ఉప్పుగల్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన ఓ బాలిక (17) హన్మకొండలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వీతియ సంవత్సరం చదువుతుందని, దసరా సెలవులు కావడంతో ఆమె రెండురోజుల క్రితమే ఇంటికి వచ్చిందని తెలపారు. శనివారం బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా మధ్యాహ్నం సమయంలో తను ఇంటిముందు నిలబడడంతో ఇది గమనించిన ఇంటిపక్కన ఉన్న యువకుడు దాసోజు రాజేష్‌చారి (23) ఒక్కసారిగా బాలిక వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. అమాంతంగా ఎత్తుకెళ్లి ఎదురుగా ఉన్న వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో భయపడి ఆమెను పక్కనే ఉన్న పాడుబడ్డ నీరులేని బావిలోకి తోసివేసి.. యువకుడు సైతం బావిలోకి దూకాడు. బాలిక కేకలు విన్న సమీపంలోని ఆటోడ్రైవర్లు, స్థానికులు బావివద్దకు వెళ్లి వెంటనే గాయాల పాలైన బాలికను తాడు సహాయంతో పైకితీసి 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున బావి వద్దకు చేరుకోవడం, అంతే కాకుండా ఈ విషయాన్ని పోలీసులకు తెలియచెప్పడంతో వర్ధన్నపేట ఏసీపీ మధుసూధన్, సీఐ కర్ణసాగర్‌రెడ్డి, జఫర్‌గడ్ ఎస్సై వెంకటకృష్ణలు అక్కడకు చేరుకొని గ్రామస్థులను అదుపు చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత నిందితుడిని జనగామ నుండి వచ్చిన అగ్నిమాకప సిబ్బందితో బయటకు తీశారు. ఆ యువకుడిపై కోపోదృకులైన జనం దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకొని వారిని చెదరగొట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను గ్రామస్థులు డిమాండ్ చేస్తూ పోలీసుల వాహనానికి అడ్డుతగిలారు. చట్టప్రకారం నింధితుడిపై కేసు నమోదు చేస్తామని ఏసీపీ మధుసూధన్ గ్రామస్థులకు చెప్పడంతో శాంతించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేయడం జరిగిందని జఫర్‌గడ్ ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.

బస్సు.. లారీ ఢీ
* ముగ్గురికి తీవ్ర గాయాలు
ఆత్మకూరు, అక్టోబర్ 13: ఆత్మకూ రు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు ను లారీ అతివేగంతో వచ్చి ఢీ కోట్టడంతో ముగ్గురు ప్రయాణీకులు తీవ్ర గాయాలు కాగా, బస్సులో ఉన్న 72 మంది ప్రయాణీకులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం ఏటూరునాగారం నుండి హైదరాబాద్‌కు 75 ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ అద్దెబస్సు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోకి రాగా హన్మకొండ నుండి ములుగు వైపు కంకర లోడుతో వెళ్తున్న లారీ అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో లారీ కోట్టడం తో లారీ బస్సును ఢీ కొట్టి అదుపు తప్పి డీసీసీ బ్యాంక్ ముందుకు దూసుకెళ్లింది. ముగ్గురు ప్రయాణీకులను ఏంజీయంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు సీఐ తెలిపారు.