క్రైమ్/లీగల్

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 13: బెజవాడ కేంద్రంగా చేసుకుని పొరుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ 22మంది నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 13లక్షలకు పైగా నగదుతోపాటు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోలీసు కమిషనర్ వివరాలు వెల్లడించారు. విజయవాడ కేంద్రంగా రాజమండ్రి, భీమవరం, గుంటూరు తదితర ప్రాంతాల్లో నిర్వాహకులు విచ్చలవిడిగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం పోలీస్టేషన్ పరిధిలోని రైతుబజారు సమీపంలో ఒక ఇంట్లో రెండో అంతస్తులోని గదిపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బుర్రి సత్యనారాయణ, వాసా కొండలరావు, అడపా వెంకట కృష్ణారావు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడికి చెందిన బుర్రి సత్యనారాయణ కొద్దిరోజులుగా ఇబ్రహీంపట్నం రైతుబజారు వద్ద ఇంటిని అద్దెకు తీసుకుని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. విజయ హాజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడు (విఎస్) అస్సాం క్రికెట్ మ్యాచ్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. రాజమండ్రికి చెందిన సప్పా రవి అనే బుకీద్వారా నిందితులు ముగ్గురూ కలిసి బెట్టింగ్‌లు నిర్వహిస్తుండగా బెట్టింగ్‌లు కాస్తున్న 12మంది వివరాలు రాబట్టిన టాస్క్ఫోర్స్ సిబ్బంది విజయవాడ, గుంటూరుకు చెందిన దేవిరెడ్డి శ్రీనివాసరావు, మొగిలి రాంబాబు, మంగినేని అకిలేష్‌కుమార్, అవనపు దుర్గారావు, వాసా శ్రీనివాసరావు, గుంటూరు నాగరాజు, జిల్లా నందగోపాల్, పెనిమిటి శ్రీనివాసరావు, చిట్టా విశ్వనాధ శివాంస్, బండారి శ్రీనివాసమూర్తి, మైనేని వినయ్‌కుమార్, పచ్చిగుళ్ళ మురళీ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ప్రధాన బుకీ సప్పా రవిచంద్ర వౌళిని అదుపులోకి తీసుకుని విచారించగా గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్‌కు చెందిన ముదునూరి జోతిర్వేంద వెంకట వర్మరాజు, మన్యం శ్రీనివాసరావు, గద్దె విశ్వనాధం, పిన్నబోతు దుర్గాప్రసాద్, దాట్ల వెంకట సత్యసూర్యనారాయణ, మంతెన శ్రీనివాస మదన వర్మ లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 58సెల్‌ఫోన్లు, మూడు ల్యాప్‌ట్యాప్‌లు, ఎల్‌ఇడి టివి, ఒక కారు, మూడు మోటారు సైకిళ్ళు, రూ.13.01.353 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.