క్రైమ్/లీగల్

జడ్జి భార్య, కుమారుడిపై కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్, అక్టోబర్ 13: ఒక జడ్జి భార్య, కుమారుడిపై అతని అంగరక్షకుడే కాల్పులు జరిపిన ఉదంతమిది. ఢిల్లీలో శనివారం జరిగిన ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులిద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, వారి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పు ఢిల్లీ డీసీపీ సులోచన గజ్‌రాజ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అదనపు సెషన్స్ జడ్జి కృష్ణకాంత్ భార్య రీతు, కుమారుడు ధ్రువ్ శనివారం మధ్యాహ్నం ఆర్కాడియా మార్కెట్‌కు షాపింగ్ చేయడానికి వెళ్లారు. వారితో పాటు కృష్ణకాంత్ అంగరక్షకుడు మహిపాల్ వెళ్లాడు. 3.30 గంటల సమయంలో ఆర్కాడియా మార్కెట్ వెలుపల కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు బృందం వచ్చే సరికి రీతు, ధ్రువ్ రక్తపు మడుగులో పడి ఉన్నారు.