క్రైమ్/లీగల్

ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాచిపెంట, అక్టోబర్ 14: ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన వెలుగుచూసింది. మండలంలోని నీలమవలస గ్రామానికి చెందిన దళాయి సన్యాసిరావు(19)ను ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడని ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన అందించిన వివరాల ప్రకారం సన్యాసిరావు గ్రామంలో జరగనున్న ఓ శుభకార్యానికి అవసరమైన సామాన్ల కోసం ద్విచక్రవాహనంపై ఆదివారం గురివినాయుడుపేటకు వచ్చాడు. అయితే సామాన్లను కొనుగోలు చేసి తిరిగి వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. దీంతో సన్యాసిరావు అక్కడికక్కడే మృతిచెందగా వాహనంపై ఉన్న మరో వ్యక్తి ఎర్రజన్ని అప్పారావుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రుడిని వైద్యం కోసం సాలూరు సిహెచ్‌సీకి తరలించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు సోమయ్య, గున్నమ్మలు విలపిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు.