క్రైమ్/లీగల్

మావోల సానుభూతిపరుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, అక్టోబర్ 14: మల్కన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసినట్టు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ జగన్మోహన్ మిశ్రా తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల పదో తేదీన ఆంధ్రా-ఒడిషా పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారని, చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిధిలో జంత్రి వద్ద ఈనెల 12న ఉదయం పోలీసు పార్టీని చూసి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సామాగ్రితో పరుగులు తీశారని, అయితే పోలీసులు వారిని పట్టుకుని సోదాలు చేయగా, పేలుడు సామాగ్రి ఉందని తెలిపారు. దీంతో వారిని ప్రశ్నించగా, మావోయిస్టులకు సానుభూతిపరులుగా పని చేస్తున్నామని, పోలీసు పార్టీలను లక్ష్యంగా చేసుకుని మందు పాతరలను పెట్టడానికి వెళ్తున్నామని ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. వీరి నుండి రెండు క్యారేజీ బాక్సులు, మేకులు, గాజు పెంకులు, యూరియా, రెండు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, మూడు ప్యాకెట్ల జిలిటెన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ వైరును స్వాధీనం చేసుకున్నారు. వీరిని గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.