క్రైమ్/లీగల్

పిడుగుపాటుకు విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, అక్టోబర్ 14: కె గంగవరం మండలం కుందూరు జడ్పీ హైస్కూలు వద్ద ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పిడుగు పడి బీటెక్ చదువుతున్న సుంకర పవన్ అనే విద్యార్థి మరణించాడు. అతనితోపాటు మరో ఇద్దరు సమీపంలోనే ఉన్నప్పటికీ వారు పిడుగు పాటు నుంచి రెప్పపాటులో తప్పించుకున్నారు. కె గంగవరం మండలం కుందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో వాలీబాల్ ఆడుతుండగా ఆ గ్రామానికి చెందిన సుంకర పెంటయ్య కుమారుడు పవన్ క్రీడను చూసేందుకు వచ్చి పిడుగుపాటుకు బలయ్యాడు. వెంటనే రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. సుంకర పెంటయ్య కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండగా వారందరికీ పవన్ వారసుడు కావడం గమనార్హం. రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు కుందూరులో పవన్ కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా పవన్ మృతిపై కె గంగవరం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదుచేసినట్టు ఎస్సై జి నరేష్ తెలిపారు.