క్రైమ్/లీగల్

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటపాలెం, అక్టోబర్ 14: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పొట్టి సుబ్బయ్యపాలెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, గ్రామానికి చెందిన మత్స్యకారుడు కొండూరి పోలయ్య (42) ఆదివారం ఉదయం గ్రామానికి సమీపంలోని కొత్తకాలువ సముద్రంలో కలిసే పొగురు వద్ద చేపలు పడుతుండగా ప్రమాదానికి గురై నీటిలో మునిగిపోయాడు. సమీపంలో చేపలు పడుతున్న కొందరు వ్యక్తులు నీటి నుంచి బయటకు తీసేటప్పటికే పోలయ్య మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్టేషన్ రైటర్ శ్యామ్‌బాబు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాలకు తరలించారు.