క్రైమ్/లీగల్

గ్యాంగ్‌వారే హత్యకు కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.రాయవరం, అక్టోబర్ 14: నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్ వద్ద శనివారం ఉదయం జరిగిన హత్యోదంతానికి సంబంధించి రెండు గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న తగాదాలే కారణమని తమిళనాడు రాష్ట్రంలోని మధురైకు చెందిన పాండ్య, ఉదయ్ గ్యాంగ్‌ల మధ్య గత నాలుగేళ్లుగా ఆధిపత్య పోరు కొనసాగుతుందని, ఇప్పటికే గ్యాంగ్‌కు సంబంధించి ఒకరు మృతి చెందగా మరో గ్యాంగ్ నేత అరెస్టయ్యారని, శనివారం జరిగిన హత్యకు సంబంధించి ఈ గ్యాంగ్‌వార్‌లో భాగమేనని నర్సీపట్నం ఎఎస్పీ అరీఫ్‌హఫీజ్ అన్నారు. ఆదివారం సాయంత్రం అడ్డురోడ్డులోని సర్కిల్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఎఎస్పీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హత్యకు సంబంధించి విశాఖలోని ఒక ప్రాంతంలో హత్యకు సంబంధించిన నేరగాళ్లకు సమావేశమయ్యారని, ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే అమర్‌ను హత్యచేసారని ఎఎస్పీ తెలిపారు. ఇదిలావుండగా అమర్ కొన్నాళ్లుగా గంజాయి అక్రమ రవాణా చేసే వారి వివరాలు సేకరించి వాహనాలను అడ్డగించి అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటాడని రాష్ట్రంలోని టోల్‌గేట్‌ల వద్ద గంజాయిని తరలించే వాహనాలపై ఇతను హవా కొనసాగిస్తాడని ఎఎస్పీ తెలిపారు. ఇదిలావుండగా ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగిన హత్యకు సంబంధించిన నేరస్తులు కేవలం రెండుగంటల్లోనే వెంబడించి పట్టుకున్న యలమంచిలి, నక్కపల్లి సర్కిల్‌కు చెందిన పోలీసుల చర్యలను ఎఎస్పీ అభినందించారు. సంఘటన జరిగిన వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేయడంతోపాటు గ్రామస్తులతో వీరికి ఏర్పడ్డ అనుబంధం కారణంగా నిందితులను పట్టుకోగలిగామని యలమంచిలి సీఐ విజయానంద్, నక్కపల్లి సీఐ రుద్రశేఖర్, ఎస్. రాయవరం, యలమంచిలి రూరల్, టౌన్ ఎస్‌ఐలతోపాటు నక్కపల్లి ఎస్‌ఐలు వెంటనే స్పందించడంతో నిందితులు ఏడుగురిని అరెస్టు చేయగలిగామని ఆయన తెలిపారు.
మృతుడు అమర్ గత కొన్నిరోజులుగా అడ్డురోడ్డులోని ఒక లాడ్జిలో ఉంటున్నట్లు సమాచారం అందిందని అమర్ కొంతమందితో కలిసి తిరుగుతున్నట్లు తెలియడంతోపాటు హత్యకు సంబంధించి వారి పాత్ర ఏమైనా ఉందా అనే విషయమై దర్యాప్తు జరుపుతున్నామని మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎఎస్పీ తెలిపారు. నక్కపల్లి మండలంలోని టోల్‌గేట్ వద్ద నిఘా పెంచుతామని, అవసరమయితే క్లోజరైస్‌తోపాటు సీసీ కెమెరాల సామర్ధ్యం పెంచడం వంటి చర్యలు చేపడతామని ఏఎస్పీ తెలిపారు. ఆయన వెంట యలమంచిలి సీఐ విజయానంద్, నక్కపల్లి సీఐ రుద్రశేఖర్, స్థానిక ఎస్‌ఐలు కుమార స్వామి, సూర్యనారాయణ, సింహాచలం, యలమంచిలి ఎస్‌ఐలు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
మాడుగుల, అక్టోబర్ 14: రోడ్టు ప్రమాదంలో ఇద్దరు భవాని భక్తులకు ఆదివారం తీవ్ర గాయాలయ్యాయి. పెందుర్తి మండలం సత్తివానిపాలెం గ్రామానికి చెందిన నెక్కల శంకరరావు, మువ్వల రాజు అనే భవాని భక్తులు ఘాట్ రోడ్డు నుంచి మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి వస్తుండగా ఎదురుగా వెళుతున్న మరో బైకు ఢీ కోనడంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు చేయిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.