క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, అక్టోబర్ 14: హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై గల వెల్దండ మండల కేంద్రానికి సమీపంలో అదివారం తెల్లవారుజామున అర్టీసీ బస్సు ఢీకొని వడ్తావత్ వెంకట్యనాయక్ (45) అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై వీరబాబు తెలిపారు. మండల పరిధిలోని ఉబ్బలగట్టుతాండకు చెందిన వెంకట్యనాయక్ అదివారం కల్వకుర్తిలో పశువుల సంత ఉండటంతో తన గేదెను విక్రయించేందుకు జాతీయ రహదారిపై నడుచుకుంటూ గేదెను తీసుకుని పోవుచుండగా ఆచ్చంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆచ్చంపేట డీపోకు చెందిన ఎపి29జెడ్ 2974 గల బస్సు ఢీకొట్టడంతో వెంకట్యానాయక్‌తో పాటు సుమారు రూ.60వేల విలువగల గేదే అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు వెల్దండ ఎస్సై వీరబాబు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. కాగ మృతుని భార్య అంతికి వైస్ ఎంపిపి వెంకటయ్యగౌడ్, జడ్పీటీసీ తనయుడు సంజీవ్‌కుమార్‌యాదవ్, అర్టీసీ అధికారులు, స్థానిక సిఐ గిరికుమార్‌కల్కోటా, ఎస్సై వీరబాబులు రూ.45వేలకుపైగా అర్థిక సహాయం చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
*మరొకరికి తీవ్రగాయాలు
జడ్చర్ల, అక్టోబర్ 14: 44వ నంబర్ జాతీయ రహాదారిపై ఆదివారం సాయంత్రం మాచారం గ్రామం వద్ద మోటార్‌సైకిల్‌ను మినిబస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (65) మోటార్ సైకిల్‌పై బస్వప్ప అనే మరో వ్యక్తితో కలిసి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి తిరుపతి వైపు అతివేగంగా వెళ్తున్న మినీ బస్సుఢీకొంది. ఈ ఘటనలో శ్రీనివాస్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా బస్వప్ప తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనకు సంబందించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై లెనిన్ తెలిపారు. గాయాలపాలైన బస్వప్పను చికిత్స నిమిత్తం ఆస్పథ్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.