క్రైమ్/లీగల్

పరువునష్టం కేసులు వేసిన ఎంజే అక్బర్, అలోక్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయి, అక్టోబర్ 15: గత కొన్ని వారాలుగా యావద్‌భారతాన్ని కుదిపేస్తున్న మీ-టూ ఉద్యమం సోమవారం సరికొత్త మలుపు తిరిగింది. గతంలో తమను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు చేస్తున్న బాధిత మహిళలపై పరువునష్టం కేసులు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి ఎంజే అక్బర్, ప్రముఖ నటుడు అలోక్‌నాథ్‌లు తమపై అరోపణలు చేసిన మహిళలపై పరువు నష్టం కేసులు నమోదు చేశారు. ప్రముఖ పాత్రికేయురాలు ప్రియారమణపై ఎంజే అక్బర్ క్రిమినల్ డిఫమేషన్ కేసు వేశారు. అలాగే నటుడు అలోక్ కుమార్ కూడా రచయిత, దర్శకురాలు నందాపై సివిల్ దావా వేశారు. వీరిద్దరు కూడా తమకు పరువు నష్టం జరిగిందంటూ కోర్టులను అశ్రయించిన నేపథ్యంలో బాధిత మహిళలు మరింతగా తమ గళాన్ని వినిపించారు. బెదిరింపులకు లొంగేది లేదని, తమ పోరాటాన్ని కొనసాగించి తీరుతామని నిస్పష్టంగా తెలిపారు. తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, నష్టపరిహారం కింద రూపాయి చెల్లించాలని కోరుతూ నందాపై అలోక్‌నాథ్ కేసు వేశారు. కాగా క్రిమినల్ దావా వేయడం ద్వారా అక్బర్ తనను బెదిరించాలని చూస్తున్నాడని ప్రియారమణి తెలిపారు. న్యాయం తన పక్షాన ఉందని ఎలాంటి కేసు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె వెల్లడించారు.