క్రైమ్/లీగల్

జంట హత్యల కేసులో నిందితులు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, అక్టోబర్ 15: మాదమరి మండలం కోటాల అటవీ సరిహద్దులో ఇటీవల జరిగిన జంట హత్యల కేసులో నిందితులను పోలీసుల అరెస్టు చేసారు. జిల్లాలో ఈ జంట హత్య కేసుల కలకలం సృష్టించాయి, మృతులు ఇరువురు దళితులు కావడంతో పలు దళిత సంఘాలు ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితకుటుంబాలను అదుకోవాలని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు, ముందుగా ఈ జంట హత్యలు కేసులపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును చేధించారు. పొలం వద్ద వేసిన విద్యుత్ కంచె తగలి మృతి చెందటంతో పోలం యజమాని గుట్ట చప్పుడు కాకుండా మృత దేహాలను కొటాల అటవీ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈకేసుకు సంబంధించి చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి . ఈనెల 8వ తేది రాత్రి వేపనపల్లికి చెందిన మోహన్ రెడ్డి, సమర సింహా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వేపనపల్లి కాలనీ సమీపంలో ఉన్న పంటకు రక్షణగా విద్యుత్ కంచే వేసారు. దీన్ని గమనించని వేపనపల్లికి చెందిన మామ బావమరిదులైన జయచంద్రా(45) బాబు (30) కంచెకు తగులు కొని కరెంట్ షాక్‌కు గురై అక్కడి కక్కడే ఇరువురు మృతి చెందారు. ఈ విషయాన్ని గుర్తించిన పొలం యజమాని అదేగ్రామానికి చెందిన జగన్నాధరెడ్డి, నాగరాజు రెడ్డిలతో కలిసి మృత దేహాలను గోనె సంచెలో వేసి ద్విచక్రవాహనంలో కోటాల అటవీ ప్రాంతంలో పడేసి పారిపోయారు. పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేసి మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ హత్యలకు సంబంధించి అసుల కారణం వెలుగు చూసిందన్నారు. తదుపరి మిగిలిన నిందితులైన సమరసింహారెడ్డ, చంద్రశేఖర్ రెడ్డి, జగన్నాధరెడ్డి, నాగరాజు రెడ్డిలను సోమవారం చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. నిందితులైన వారిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసామన్నారు.