క్రైమ్/లీగల్

పందులదొడ్డిలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సిద్ధమైన స్మగ్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, అక్టోబర్ 15: టాస్క్ఫోర్స్ దాడులతో దిక్కుతోచని స్మగ్లర్లు తాము ఒకప్పుడు స్మగ్లింగ్‌కు ఉపయోగించిన పాత ప్రాంతాలను తిరిగి ఎంపిక చేసుకుని అక్కడ నుంచి అక్రమ రవాణాకు సిద్ధపడుతున్నా వారిని టాస్క్ఫోర్స్ సిబ్బంది వదిలిపెట్టడంలేదు. అటవీప్రాంతంలో అడుగుజాడలు కనిపిస్తే చాలు స్మగ్లర్లు ఎంత దూరం వెళ్లినా వారిని వదిలిపెట్టకుండా వెంటాడుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం తెల్లవారు జామున ఆర్‌ఎస్‌ఐ విజయ నరసింహులు ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎల్‌ఐసీ శిక్షణా కేంద్రం సమీపంలో వారికి పాదముద్రలు కనిపించాయి. వాటిని అనుసరించిన సిబ్బంది, కిలోమీటరు దూరం అనుసరించగా పందుల దొడ్డి వద్ద అలికిడి కావడం గమనించారు. అటువైపు టార్చ్ లైట్లు వేయడంతో స్మగ్లర్లు పారిపోయారు. ఆ ప్రాంతంలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 22 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వాటిని మేస్ర్తిలకు అందించి డబ్బులు తీసుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు ఏ క్షణానైనా దాడి చేసే అవకాశం ఉండటంతో టాస్క్ఫోర్స్ ఉన్నతాధికారులు శ్రీనివాసరాజు, నాగరాజు, డాగ్ స్క్వాడ్, అదనపు సిబ్బందిని సంఘటనా స్థలానికి రప్పించారు. ఐజీ కాంతారావు అక్కడకు చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని మరో 7 దుంగలను గుర్తించింది. అలాగే స్మగ్లర్లు వదలివెళ్లిన ఒక సెల్ ఫోన్, ఇయర్ ఫోన్, టాబ్లెట్లు, మూవ్ ఆయింట్‌మెంట్, వాటర్ బాటిళ్లు, పాచిపోయిన అన్నం గుర్తించారు. ఈసందర్భంగా ఐజీ కాంతారావు మాట్లాడుతూ ఇది పాత లోడింగ్ పాయింట్ అని, ఇటీవల కాలంలో స్మగ్లర్లు ఇటువైపు రావడం లేదన్నారు. శేషాచల అడవుల వద్ద టాస్క్ఫోర్స్ నిఘా పెంచడంతో పాత లోడింగ్ పాయింట్‌ను వాడుకలోకి తెచ్చే ప్రయత్నం చేశారన్నారు. సంఘటనా స్థలాన్ని ఎసీఎఫ్ కృష్ణయ్య, ఎఫ్‌ఆర్‌ఓలు లక్ష్మీపతి, ప్రసాద్, ఆర్‌ఐ మురళి, ఎస్‌ఐ సోమశేఖర్ తదితర అధికారులు సందర్శించారు.