క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 15: కుటుంబ సమస్యల పంచాయతీ ఓ యువకుడి మృతికి దారి తీసింది. భార్య, అత్త, బంధువుల వేధింపులతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రామంతాపూర్ వాసవీనగర్‌లో నివసిస్తున్న పడకంటి శ్రీకాంతచారి (28) ఇదే ప్రాంతంలో నివసిస్తున్న భవానీని ఐదునెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు.
కొన్ని రోజులకే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల క్రితమే దసరా పండుగ సందర్భంగా పుట్టింటికి వెళ్లిన భార్య, ఆమె తల్లి సుజాత, బంధువులు శ్రీకాంతచారిని తిట్టి అవమానపరిచారని, మనస్థాపం చెందిన అతడు సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.