క్రైమ్/లీగల్

సాగర్ కాలువలో పడి ఇద్దరు మహిళలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపురాంతకం, అక్టోబర్ 16: నాగార్జున్‌సాగర్ కాలువలో బట్టలు ఉతికేందుకు వెళ్లి ఇరువురు మహిళలు మృతి చెందిన సంఘటన మంగళవారం ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో జరిగింది. వివరాల మేరకు దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన బచ్చలపురి కోటేశ్వరమ్మ (43) దూపాడులో ఉన్న అల్లుడి ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం బట్టలు ఉతికేందుకు కోటేశ్వరమ్మ, మరో మహిళ పులివెందుల లక్ష్మి (21)తో కలిసి దూపాడు బ్రిడ్జి వద్ద ఉన్న మెట్ల నుంచి నాగార్జున సాగర్ కాలువలోనికి దిగి బట్టలు ఉతికేందుకు ప్రయత్నించగా కోటేశ్వరమ్మ కాలుజారి కాలువలో పడింది. అది గమనించిన లక్ష్మి కోటేశ్వరమ్మను కాపాడేందుకు చీరను విసిరివేసింది. ఆ చీరతోపాటు లక్ష్మికూడా కాలువలో పడి ఇరువురు మృతి చెందారు. కాలువ సమీపంలో ఉన్న కొందరు యువకులు గమనించి కాలులోనికి దూకి కోటేశ్వరమ్మ, లక్ష్మిలను కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందారు. యర్రగొండపాలెం మండలం వీరాయపాలెం గ్రామానికి చెందిన శివయ్య (20) స్నేహితులతో కలిసి నాగార్జునసాగర్ కాలువకు ఈతకు వెళ్లారు. అయితే కాలువలో నీరు ఉద్ధృతంగా వస్తుండటంతో శివయ్య గల్లంతయ్యాడు. దీనితో స్నేహితులు, బంధువులు నాగార్జునసాగర్ కాలువ వద్ద వెతుకుతున్నారు. ఈవిషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు లబోదిబోమంటూ కాలువ వద్దకు చేరుకొని శివయ్య కోసం గాలిస్తున్నారు.