క్రైమ్/లీగల్

గొల్లప్రోలు వద్ద ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 22: తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక శుభకార్యంలో పాల్గొని తిరిగివెళుతున్న 15మంది బృందం ప్రయాణిస్తున్న వ్యాన్‌ను క్వారీ లారీ ఎదురుగా ఢీకొనడంతో తొమ్మది మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా విశాఖ జిల్లా మాకవరపాలెం ప్రాంతానికి చెందినవారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం జి వెంకటాపురం, జి కోడూరు గ్రామాలకు చెందిన 15 మంది టాటా మ్యాజిక్ వాహనంలో సోమవారం ఉదయం కాకినాడ వచ్చారు. ఇక్కడ ఒక గృహప్రవేశ కార్యక్రమంలో వారంతా పాల్గొన్నారు. తిరిగి మధ్యాహ్నం కాకినాడ నుండి అదే వాహనంలో స్వస్థలానికి బయలుదేరారు. గొల్లప్రోలు మీదుగా చేబ్రోలు బైపాస్ రోడ్డుకు చేరుకునేసరికి స్థానిక కోటలంకవారి చెరువు సమీపంలో ఎదురుగా క్వారీ లారీ వేగంగా టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న గౌరిరెడ్డి రాము (35), సబ్బవరపు పైడితల్లి (45), సబ్బవరకు వరహాలు (45), సబ్బవరపు పాప (30), సబ్బవరపు అచ్చయ్యమ్మ (50), పైలా లక్ష్మి (46), సబ్బవరపు నూకరత్నం సహా వాహనం డ్రైవర్ ఆళ్ళ సంతోష్ (30) మృతిచెందారు. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ
మరో ముగ్గురు మృతిచెందారు. భీమరెడ్డి నాగరాజు, కింతల రామచంద్ర, కింతల నూకరాజు, పైలా రోహిణి, సబ్బవరపు ఏసుపాదం, సబ్బవరపు సత్యవతి, సిహెచ్ సత్యవేణి తీవ్ర గాయాలతో పిఠాపురం, కాకినాడ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతుతున్నారు. దుర్ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. దుర్ఘటన జరిగిన ప్రదేశాన్ని కాకినాడ డీఎస్పీ రవివర్మ, పిఠాపురం సీఐ అప్పారావు, గొల్లప్రోలు ఎస్సై బి శివకృష్ణ పరిశీలించారు. గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

చిత్రం..క్వారీ లారీ ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన వ్యాన్. చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు