క్రైమ్/లీగల్

శబరిమల ఆలయ ప్రవేశం రివ్యూ పిటిషన్‌పై నేడు సుప్రీం నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: శబరిమల అయప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశ కల్పిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు సోమవారం సుప్రీం కోర్టు అంగీకరించింది. 10-50 మధ్యవయస్కులైన మహిళల ఆలయ ప్రవేశానికి ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది. తీర్పు వెలువడిన నాటి నుంచి కేరళ మండిపోతోంది. హిందూ సంస్థలు, అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తీర్పును పలు సంస్థలు సవాల్ చేశాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్,
జస్టిస్ ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్లు విచారించేందుకు అంగీకరించింది. ఎప్పటి నుంచి విచారించేదీ మంగళవారం నిర్ణయిస్తామని న్యాయమూర్తులు వెల్లడించారు. రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అత్యవసరంగా సమీక్షించాలంటూ న్యాయవాది జే నెడుంపర కోర్టును అభ్యర్థించారు.‘ 19 రివ్యూ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయం మాకు తెలుసు. విచారం తేదీని మంగళవారం నిర్ణయిస్తాం’అని బెంచ్ స్పష్టం చేసింది. నేషనల్ అయ్యప్ప భక్తుల అసోసియేషన్ పక్షాన నెడుంపర రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మహిళలు శబరిమల ఆలయ ప్రవేశంపై 4:1 నిష్పత్తిన తీర్పును వెలువరించింది. పిటిషన్‌లను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని న్యాయవాది ఇంతకు ముందే కోర్టును అభ్యర్థించారు. ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టలేమని ఈ నెల 9న బెంచ్ తేల్చి చెప్పింది.