క్రైమ్/లీగల్

బాణసంచా గొడౌన్లపై విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, అక్టోబర్ 22: గుడివాడ పట్టణం, రూరల్ మండలంలోని మల్లాయిపాలెం పంచాయతీ పరిధిలోని బాణసంచా గోడౌన్లపై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు చేశారు. ముందుగా స్థానిక బంటుమిల్లి రోడ్డులోని పైడి సీతారామయ్య ఫైర్ వర్క్స్ షాపును తనిఖీ చేశారు. లైసెన్స్ పరిధికి లోబడి స్టాక్ నిల్వలు ఉండడంతో మల్లాయిపాలెం పంచాయతీ పరిధిలోని కొత్తా కుమారస్వామికి చెందిన గోడౌన్‌లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సుమారు రూ.57లక్షల విలువైన బాణసంచా నిల్వలు లైసెన్స్ పరిధికి మించి ఉన్నట్టుగా గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకుని సంబంధిత తాలూకా పోలీసులకు అప్పగించారు. ఈ దాడులు విజిలెన్స్ సీఐ బీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగాయి. రాత్రి 8.30గంటల వరకు తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలావుండగా వచ్చే దీపావళిని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా బంటుమిల్లి రోడ్డు పరిసరాల్లో అనేక బాణసంచా గొడౌన్లు అనధికారికంగా ఏర్పాటయ్యాయి. ఫైర్ స్టేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరించడంతో విక్రేతలు ఇష్టానుసారంగా పెద్దఎత్తున నిల్వ చేస్తున్నారు. లైసెన్స్ ఉన్న ఒక బాణాసంచా గోడౌన్‌లోనే రూ.57లక్షల విలువైన నిల్వలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల పట్టణంలోని బేతవోలులో దాదాపు రూ.2లక్షల విలువైన బాణసంచాను అనధికారికంగా నిల్వచేసినట్టుగా గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పట్టణంలో చాలా చోట్ల అనధికారిక గొడౌన్లలో బాణాసంచాను నిల్వచేసి రీప్యాకింగ్ చేస్తున్నట్టుగా సమాచారం. దీపావళికి ముందు అడపాదడపా విజిలెన్స్ అధికారుల దాడులు మినహా ఏ ఒక్క అధికారీ బాణాసంచా నిల్వలపై దృష్టి పెట్టడం లేదు. ఏటా రూ.కోట్లలో బాణాసంచా విక్రయాలు జరుగుతున్నా ఆ స్థాయిలో జీఎస్టీ ప్రభుత్వానికి జమ కావడం లేదు. అమ్ముతున్నది రూ.లక్షల్లోనే అంటూ కాకి లెక్కలు చూపుతున్నారు. అధికారులు కూడా మామూళ్ళ మత్తులో జోగుతున్నారు. ఇప్పటికైనా ఫైర్, రెవెన్యూ, పోలీస్ అధికారులు వచ్చే దీపావళి వరకు అనధికారిక బాణసంచా గోడౌన్లపై దృష్టి పెట్టాలని, వాణిజ్య పన్నులశాఖ, ఐటీ శాఖల అధికారులు సక్రమంగా పన్నులు ప్రభుత్వానికి జమయ్యేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.