క్రైమ్/లీగల్

మీ టూ ఫిర్యాదులపై అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా మహిళలపై అసభ్య ప్రవర్తన, అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి విచారణ జరిపించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ పిల్‌పై అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని, మిగతా కేసులు వచ్చే క్రమంలోనే దీనిని పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కె కౌల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. లైంగిక వేధింపులు, అఘాయిత్యాలకు లోనైన వివిధ రంగాల మహిళలకు తమకు జరిగిన అన్యాయాన్ని ‘మీ టూ’లో వెల్లడిస్తున్నారని, వారిపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిలో సినీరంగంతో పాటు ఇతర రంగాల ప్రముఖులు ఉన్నారని, దీనిని సుమోటోగా స్వీకరించి ఆయా వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ దాఖలుకు, విచారణ చేయడానికి ఆదేశించాలని ఎంఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. జా తీయ మహిళా కమిషన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌ను ప్రతివాదులుగా చేర్చాడు. దీనిని పరిశీలించిన ధర్మాసనం ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని, మిగతా కేసుల్లాగే దీనిని పరిగణిస్తామని పేర్కొంది.