క్రైమ్/లీగల్

కుటుంబం అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయపురం, మార్చి 3: బంధువుల ఇంటికి వచ్చి తిరిగి స్వగ్రామానికి పయనమైన ఓ కుటుంబం కనిపించకపోవడంపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఇందుకు సంబంధించి పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చిలకలపాడు గ్రామానికి చెందిన పెనుమాకల శివ, దేవి దంపతులతోపాటు వీరి కుమారుడు నాగసాయి చందు, కుమార్తె లక్ష్మీదుర్గలు ఈ నెల 26న పేరవరం గ్రామంలో బంధువుల గృహప్రవేశం నిమిత్తం వచ్చారు. శివ చిలకలపాడు గ్రామంలోని నర్సరీలో రోజువారీ కూలిగా పనిచేస్తున్నాడు. కాగా ఇతని కుటుంబం 27వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆ తర్వాత నుంచి వీరి క్షేమ సమాచారాలు తెలియడం లేదు. వీరి మొబైల్ స్విచాఫ్ చేసి ఉంది. బంధువుల ఇళ్లను గాలించినా ఫలితం లేకపోవడంతో దేవి సోదరుడు అడపాక ప్రసాద్ స్థానిక పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ తెలిపారు.