క్రైమ్/లీగల్

ఏసీబీ కీలక సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 3: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సంచలన దాడులకు శ్రీకారం చుట్టింది. అక్రమాస్తులు కూడగట్టారన్న సమాచారంతో నగర పరిధిలోని ముగ్గురు ప్రభుత్వోద్యోగుల ఇళ్లపై శనివారం ఉదయం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. నగరంలో రెవెన్యూ, మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగాల్లో పనిచేస్తున్న ముగ్గురు కిందిస్థాయి ఉద్యోగుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకూ కేవలం ఉన్నత స్థాయి ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకున్న ఏసీబీ రెవెన్యూ శాఖలో వీఆర్‌ఓ, మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగంలో చైన్‌మెన్‌ల అవినీతి కార్యకలాపాల తీగ లాగింది. ముగ్గురు అవినీతి అధికారుల ఇళ్లలో సుమారు రూ.65 నుంచి 100 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తించినట్టు సమాచారం. విశాఖ నగరంలోని మద్దిలపాలెం, మల్కాపురం రెవెన్యూ క్లస్టర్లలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్‌ఓ)లుగా పనిచేస్తున్న పీ వెంకటరావు, కే సంజీవ్ కుమార్ సహా మహా విశాఖ నగరపాలక సంస్ధ (జీవీఎంసీ)లో చైన్‌మెన్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావులు ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్టు అందిన ఫిర్యాదుల మేరకు దాడులకు ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ముగ్గురు అవినీతి ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేసేందుకు 40 మందితో కూడిన ఏసీబీ బృందం ఏకకాలంలో బయలుదేరింది.
మల్కాపురం వీఆర్‌ఓగా పనిచేస్తున్న సంజీవ్ కుమార్ 2008లో రెవెన్యూ శాఖలో చేరారు. ఏసీబీ అధికారులు శనివారం జరిపిని సోదాల్లో సుమారు రూ.3.77 కోట్ల విలువైన ఆస్తులు (ప్రభుత్వ ధర) గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ దీనికి పది రెట్లు ఉంటుంది. సంజవ్ కుమార్ తనయుడు దినేష్ కుమార్ పేరిట నడుపుతున్న మూడు మెడికల్ సెంటర్లను కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. వీఆర్‌ఓ వెంకటేశ్వరరావు అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల ప్రభుత్వ విలువ రూ.1.11 కోట్లుగా నిర్ధారించారు. వీటి బహిరంగ విలువ రూ.15 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. వీటితో పాటు రూ.3.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
జీవీఎంసీలో చైన్‌మెన్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర రావు ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో రూ.1.31 మేర అక్రమాస్తులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.15 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. అక్రమాస్తులు కలిగిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.