క్రైమ్/లీగల్

డిసెంబరు 15నాటికి హైకోర్టు భవనం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నూతన రాజధానిలో అమరావతిలో డిసెంబరు 15 నాటికి తాత్కాలికంగా హైకోర్టు భవన నిర్మాణం పుర్తవుతుందని సుప్రీం కోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విన్నవించింది. హైదరాబాద్‌లోనే రెండు హైకోర్టులు ఎందుకు ఉండకూడదంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది పాలీ నారీమన్ వాదనలు వినిపిస్తూ నూతన రాజధానిలో డిసెంబరు 15నాటికి తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని, అనంతరం ఉమ్మడి హైకోర్టు విభజనకు సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి న్యాయమూర్తుల నివాసాలు, స్ట్ఫా క్వార్టర్స్ కూడా సిద్ధమపుతాయని వివరించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అటార్నీ జనగర్ కె.వేణుగోపాల్ భవన్ నిర్మాణాల ఫోటోలను కోర్టుకు అందించాలని, డిసెంబరు 15న హైకోర్టు నూతన భవనలు సిద్ధమవుతాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ఉమ్మడి హైకోర్టు విభజన త్వరగా జరగాలని కోరుకుంటున్నామని
అన్నారు. ఏపీ తరపు న్యాయవాది జోక్యం చేసుకుని ఇప్పటికే న్యాయాధికారుల విభజనకు నోటిఫికేషన్ విడుదల అయిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్ ఏకే సిక్రీ జోక్యం చేసుకుని హైకోర్టు విభజన జరగకుండా కొత్తగా జడ్జీల నియామకాలు జరిగితే మళ్లీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వీలైనంత త్వరగా జరపాలని ధర్మాసనం ఆశా భావం వ్యక్తంచేసింది. నూతన హైకోర్టు నిర్మాణాలు పూర్తయ్యాక ఉమ్మడి హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశాలు జారిచేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.