క్రైమ్/లీగల్

సమయం తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: సుప్రీం కోర్టులో మహారాష్ట్ర పోలీసులకు ఉపశమనం లభించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోరేగావ్ -భమా అల్లర్ల కేసులో చార్జిషీట్ దాఖలుకు సుప్రీం కోర్టు మరికొంత గడువుఇచ్చింది. కేసు దర్యాప్తు, చార్షిషీట్ దాఖలుకు గడువుఇవ్వాలంటూ మహారాష్ట్ర పోలీసులు కోర్టును అభ్యర్థించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం బాంబే హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది.
దర్యాప్తు, చార్షిషీట్ దాఖలుకు సంబంధించి కింది కోర్టు ఇచ్చిన దేశాలను ధర్మాసనం పక్కన బెట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు హక్కుల నేతలకు నోటీసులు జారీ చేసి, రెండువారాల్లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌తో కూడిన బెంచ్ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చారు. మహారాష్ట్ర పోలీసుల తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రొహత్గీ సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు.