క్రైమ్/లీగల్

ఎస్‌ఎస్‌సీ పరీక్షను రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పేపర్‌లీక్‌తో పాటు పలు అవకతవకలు జరిగాయని భావిస్తున్న స్ట్ఫాసెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్‌ను రద్దు చేసి, తాజాగా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) లేదా సిబిఎస్‌ఈ ద్వారా నిర్వహించాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టులో వెలువడిన ఈ పరీక్ష ఫలితాలపై కోర్టు ఇప్పటికే స్టే విధించింది. ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ పరీక్షలలో పలు అవకతవకలు జరిగాయని పిటిషనర్ శంతన్ కుమార్ తరఫున వాదించిన అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. సిఫీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను అప్పగించారని, వారు పలు అవకతవకలకు పాల్పడటంతో పేపర్ లీక్ కావడమే కాక అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై సీబీఐ సైతం విచారణ నిర్వహించిందని చెప్పారు. ఈ పరీక్షను రద్దు చేసి స్ట్ఫా సెలక్షన్‌కు గాని, మరే ఇతర ప్రభుత్వ సంస్థకు గాని అప్పగించాలని వారు కోరారు. ప్రభుత్వం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల ఈ సమస్య ఒక్క పరీక్ష పేపర్‌కు మాత్రమే ఉత్పన్నమైందని చెప్పారు. మొత్తం అన్ని పరీక్షలను రద్దు చేయమనడం సమంజసం కాదని అన్నారు. అయితే ఆయన వాదనను కోర్టు తిరస్కరించింది. దీనిపై సీబీఐ ఇచ్చిన నివేదికను మెహతా చదివి ఉండరని వ్యాఖ్యానించింది. పిటిషనర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది. దీనిపై కేంద్రం నవంబర్ 13లోగా తన సమాధానాన్ని తెలియజేయాలని ఆదేశిస్తూ కేసును ఆ రోజుకు వాయిదా వేసింది.