క్రైమ్/లీగల్

పోలీస్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదపూడి, మార్చి 3: పెదపూడి పోలీస్టేషన్‌లో వైసీపీ మండల కార్యదర్శి పెంకే చిన ఏకాశి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం మండలంలో కలకలం సృష్టించింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గండ్రే గ్రామానికి చెందిన ఏకాశి గ్రామంలోని వల్లు రామతులసి, దెయ్యాల మంగయమ్మ సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నాడని, విషయం రెవెన్యూ అధికారుల పరిశీలనలో ఉండగా రామతులసి వివాదాస్పద స్థలంలో గోడ నిర్మించడం ప్రారంభించిందన్నారు. దీంతో విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఈ నేపధ్యంలో బాధితులు గోడ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో ఎస్సై కిశోర్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఐదుగురిపై కేసు నమోదు చేశారన్నారు. అయితే వారిలో ఏకాశి పేరు లేకపోయినప్పటికి పలుమార్లు విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఫోన్‌లో రికార్డు చేసిన వీడియోలో ఏకాశి ఆరోపించాడు. ఏకాశి పేరును జీడీ ఫైల్‌లో నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. శనివారం కూడా ఎప్పటిలాగే విచారణకు రావాలని పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారని వారి వేధింపులకు భయపడిన ఏకాశి వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించి పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇంత జరిగిన పోలీసులు పట్టించుకోకపోవడంతో వేరే కేసు కోసం స్టేషన్‌కు వచ్చిన వారు అతనిని ద్విచక్రవాహనంపై కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఏకాశి పరిస్థితి విషమంగానే ఉందని బంధువులు చెబుతున్నారు. కాగా ఎస్సై తీరుపై అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మండిపడ్డారు. ఏకాశీ మందు తాగిన విషయం తెలుసుకుని హుటాహుటిన పెదపూడి వచ్చిన ఆయన పోలీస్టేషన్‌లో మందుతాగిన ప్రదేశాన్ని పోలీసులు శుభ్రం చేసి ఉండడాన్ని గమనించిన ఆయన జరిగిన సంఘటన పై ఆరా తీశారు. రాగద్వేషాలకు అతీతంగా పని చేయవలసిన ఎస్సై కిశోర్‌బాబు టీడీపీ ఏజంటుగా పని చేస్తున్నారని ఆరోపించారు. విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లి ఏకాశికి వైద్యం అందుతున్న తీరుని పర్యవేక్షించారు. డాక్టర్ వెంట పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, పలవురు వైసీపీ నాయకులు ఉన్నారు.