క్రైమ్/లీగల్

పోలీస్ స్టేషన్లపై దాడి ఘటనలో నిందితుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, అక్టోబర్ 31: అరకులోయ, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు గత నెల 23వ తేదిన హత్య చేయడంతో కోపోద్రికులైన అభిమానులు పోలీస్ స్టేషన్లపై దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నలు ఫలించకపోగా, ఒక కానిస్టేబుల్‌పై ఆందోళనకారులు దాడి చేసి చితకబాదారు. ఈ సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగి గత కొద్ది రోజులుగా సమగ్ర విచారణ నిర్వహించి పోలీసు స్టేషన్లపై దాడికి పాల్పడిన నిందితులను గుర్తించారు. ఆందోళనకారుల విధ్వంసకర సంఘటనలో సి.సి.కెమెరాలు సైతం దెబ్బతినడంతో నిందితులను శాటిలైట్ ద్వారా గుర్తించిన సిట్ బృందం వారిపై కేసులు నమోదు చేసారు. ఈ నిందితులను కొద్ది రోజుల క్రితమే అరెస్ట్ చేయాలని భావించినప్పటికీ అనివార్య కారణాల వలన ఆలస్యమై ప్రస్తుతం అరెస్ట్‌ల పరంపర కొనసాగిస్తున్నారు. పోలీస్ స్టేషన్లపై దాడికి ఎగబడినట్టు 76 మందిని గుర్తించిన సిట్ బృందం మొదటి విడతగా 30 మందిని బుధవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. అయితే మిగిలిన 46 మందిని కూడా దశలవారీగా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పోలీసు స్టేషన్లపై దాడికి పాల్పడిన వారిని చడీ చప్పుడు లేకుండా అరెస్ట్ చేస్తున్న పోలీసులు వెనువెంటనే వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసారు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ నిందితుల అరెస్ట్‌ల పర్వాన్ని రహస్యంగా చేస్తున్నట్టు తెలుస్తోంది.

కలకలం సృష్టించిన వాల్‌పోస్టర్లు
జి.మాడుగుల, అక్టోబర్ 31: మావోయిస్టు పార్టీ అగ్రనేత జగబందుపై గిరిజన అభ్యుదయ సంఘం పేరిట వెలిసిన వాల్‌పోస్టర్లు మండలంలో సంచలనం సృష్టించింది. మండల కేంద్రమైన జి.మాడుగులలో బుధవారం వెలసిన ఈ వాల్‌పోస్టర్లలో మావో పుట్టిన దేశంలోనే మావోయిజం లేనప్పుడు పవిత్రమైన భారతదేశంలో ఈ పశుపాసాన్ని ఎందుకు ప్రయోగిస్తునావని, నీ వల్ల వందలాది కుటుంభాలు రోడ్డున పడి వందల సంఖ్యలో విద్య, వైద్యం, ఉద్యోగాలకు దూరవౌతున్నారని ఆరోపించారు. గిరిజన నాయకులైన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను ఎందుకు చంపారో చెప్పడానికే మీ వద్ద సరైన సమాదానం లేక గిరిజనుల ఆగ్రహానికి గురవుతారనే భయంతో ఇంతవరకు కనీసం పత్రికాప్రకటన కూడా ఇవ్వలేని మీరు సమ సమాజాన్ని స్థాపిస్తారా? అంటూ వాల్‌పోస్టర్లలో ప్రశ్నించారు. నీవు, నీ మావోయిస్టు పార్టీ ఇన్‌ఫార్మర్ల పేరుతో 40 మంది గిరిజనులను హత్య చేసి వందల కుటుంభాల ఇళ్లలో కరువు దాడి నిర్వహించిన నీవు వారిపై ఏ నిజాలు తెలుసుకున్నావో నీకు అనుంబంధంగా పనిచేసే పౌర హక్కుల సంఘాలు నిజ నిర్థారణ కమిటీల పేరుతో వచ్చి ఏం నిగ్గు తేల్చారో చెప్పగలవా అంటూ నిలదీసారు. మావోయిస్టు దళాల్లో మహిళా దళ సభ్యులపై జరుగుతున్న లైగింక దాడులపై ఎందుకు నిజనిర్థారణ కమిటి వేయరని ప్రశ్నించారు. గిరిజనుల హత్య, దాడులపై పాల్గొన్న కరుడుగట్టిన మహిళా మావోయిస్టు మీనాపై జగబంధు అనే నీ వివరణ ఏంటో కూడా ఇంతవరకు చెప్పలేకపోయిన నీవు పార్టీలో మహిళలపై జరుగుతున్న లైగింక వేధింపులకు సమాధానం ఏం చెప్పుతావు లే అంటూ వ్యంగంగా వాల్‌పోస్టర్లలో పేర్కొన్నారు. ఆదివాసీ యువతీ, యువకులను వారపు సంతలు, మండల కేంద్రాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించే నీవు జగబంధు కాదు సమాజాన్ని పీడించి పీక్కుతినే రాబందు అంటూ గిరిజన అభ్యుదయ సంఘం పేరిట వాల్‌పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ సంఘం పేరుతో మావోయిస్టు నేత జగబంధుకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు విడుదల కావడం స్థానికంగా సంచలనం సృష్టించడమే కాకుండా చర్చానీయాంశంగా మారింది.