క్రైమ్/లీగల్

వాహనాల తనిఖీల్లో నగదు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, అక్టోబర్ 31: మండల పరిధిలోని పీర్లపల్లి గ్రామ శివారులో బుధవారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నగదు స్వాదీనం చేసుకున్నారు. గజ్వేల్ సీఐ శివలింగం, జగదేవ్‌పూర్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనీఖిల్లో కారులో తరలిస్తున్న రూ. 5 లక్షల 40వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ డబ్బుల సంభందించి వారి వద్ధ ఎలాంటి ఆధారాలు లేక పోవడంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఎన్నికల ఖర్చుల నిర్వహణ కమీటికి అందాజేస్తామని తెలిపారు.
రూ.4లక్షల మద్యం పట్టివేత
వెల్దుర్తి, అక్టోబర్ 31: రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధవౌతున్న తరుణంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న వేల నాయుకులు ముందుగా మద్యాన్ని నిలువచేసే పనిలో ఉన్నారు. కాగా మధ్యం బాటిళ్లతో ఓట్లను దడ్డుకునేందుకు చేస్తున్న నాయకులకు వెల్దుర్తి పోలీసులు నీల్లు జల్లారు. విశ్వాసనీయ వర్గాల సమాచారం మేరకు వెల్దుర్తి పోలీసులు సూమారు రూ.4లక్షల 78వేల అక్రమ మద్యాన్ని అర్థరాత్రి పట్టుకున్నారు. వెల్దుర్తి మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సిహ్మారెడ్డి అక్రమ మద్యాన్ని తన ఇంటి పెరట్లో నిలువ చేస్తున్నాడన్న సమాచారం మెరకు తమ పోలీసు సిబ్బంది సహాయంతో రాత్రి వెళ్లామన్నారు. ఎంసి కాటన్ బాక్సులు 48 ఉన్నాయని ఓక కాటన్‌లో 48 ఉంటాయన్నారు. మొత్తం 3984 మద్యం బాటిళ్లనుపట్టుకున్నామని వాటి వలువ రూ. 4లక్షల 78వేల 80 విలువగల మద్యాన్ని పట్టుకున్నామని తెలిపారు. నర్సిహ్మారెడ్డిపై కేసునామోదు చేశామని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ గంగారాజు తెలిపారు.
మొబైల్ ఫోన్లు, బైక్ దొంగ అరెస్టు
* 14 సెల్‌ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
సిద్దిపేట, అక్టోబర్ 31: సిద్దిపేట పట్టణంలోని బిగ్ సి షోరూంలో 12రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసును సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలు బుధవారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ రామేశ్వర్ వివరించారు. ఈనెల 18వ తేదిన సిద్దిపేట పట్టణంలోని పాతబస్టాండ్ సమీపంలోని బిగ్ సి మోబైల్ షోరూం తాళం పగులగొట్టి, అందులో ఉన్న 14మోబైల్ పోన్లు దొంగతనానికి గురైయినాయి. షోరూం నిర్వహాకుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన వన్ టౌన్ సీఐ నందీశ్వర్‌రెడ్డి కేసు పరనిశోధన వేగవంతం చేశారు. ఈనెల 30వ తేదిన సిద్దిపేటలోని ఎంజేఆర్ సర్కిల్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా నింధితుడు షేక్ అబ్దుల్ కలాం(20) కోహెడ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామస్తుడు తన మోటర్ సైకిల్‌పై పోలీసులను చూసి పారితోతుండా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని విచారించగా బిగ్ సి షోరూంలో చేసిన దొంగతనం కేసు ఒప్పుకున్నట్లు తెలిపారు. గతంలో నిందితుడు సిద్దిపేట పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి మైత్రి వనం కాలనీలో హోండా ఆక్టివా, పల్సర్ మోటర్ సైకిల్, భారత్ నగర్‌లో పల్సర్ మోటర్ సైకిల్, ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో హోండా ఆక్టివా దొంగతనం చేసినట్లు ఓప్పుకున్నట్లు తెలిపారు. నేరస్తుడి నుండి 14 మోబైల్ పోన్లు, 2మోటార్ సైకిల్లు, 2హోండా ఆక్టివాలు స్వాదీనం చేసుకొని నిందితున్ని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్స్ కమలాకర్‌రెడ్డి, రవీంద్రాలను ఏసీపీ అభినందించారు.